'105 Minutes' Trailer: సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్- భయంతో వణికిస్తున్న హన్సిక ‘105 మినిట్స్' ట్రైలర్
'105 Minutes' Trailer: హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్'. రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
!['105 Minutes' Trailer: సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్- భయంతో వణికిస్తున్న హన్సిక ‘105 మినిట్స్' ట్రైలర్ 105 Minutes Trailer For Hansikas Single Character Single Shot Movie Out '105 Minutes' Trailer: సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్- భయంతో వణికిస్తున్న హన్సిక ‘105 మినిట్స్' ట్రైలర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/18/e4c5fa2611396be7d4ac7f6e4f69d8321705586335935544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hansika'105 Minutes' Trailer: హన్సిక కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’. రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నారు. బొమ్మ కె శివ నిర్మాత. జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటిలో ఇందులో హన్సిక రక్తమోడుతున్న గాయాలతో సీరియస్‌గా కనిపిస్తున్నది. త్వరలో ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం భయంతో వణుకు పుట్టిస్తోంది.
భయంతో వణుకు పుట్టిస్తున్న ‘105 మినిట్స్’ ట్రైలర్
ట్రైలర్ ప్రారంభంలో హన్సిక ఓ పెద్ద బంగ్లాలో ఉంటుంది. దాని డోర్లు లాక్ అవుతాయి. అందులోంచి బయటకు వచ్చేందుకు చాలా ప్రయత్నిస్తోంది. ఇంట్లో, అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఆమెను ఏదో ఒక అదృశ్య శక్తి భయ పెట్టడంతో పాటు చంపేందుకు ప్రయత్నిస్తుంది. ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ఇంట్లో నుంచి బయటకు రాలేక, తనను తానే హింసించుకుంటుంది. గొంతుకు చైన్ చుట్టుకుని చనిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అంతేకాదు, కత్తితో గొంతును కోసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఆమెను వెంటాడే శక్తి ఏంటి? దాని నుంచి ఆమె ఎలా భయటపడింది? అనేది ఈ సినిమాలో చూడాల్సిందే!
'బర్డ్ మన్', '1917' తరహాలో ‘105 మినిట్స్’
అటు అదృశ్య శక్తి నుంచి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా హన్సిక అద్భుతంగా నటించారని, ప్రతి సన్నివేశంలో అద్భుతమైన హావభావాలు ప్రకటించారని ఇప్పటికే దర్శక నిర్మాతలు తెలిపారు. హన్సిక నటన సినిమాకు హైలైట్ అవుతుందని పేర్కొన్నారు. సామ్ సిఎస్ నేపథ్య సంగీతం, రహ్మ కడలి ఆర్ట్ వర్క్, కిషోర్ బోయిదాపు కెమెరా వర్క్ సినిమాకు ప్రాణం పోశాయని తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా థ్రిలింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' మూవీ స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో హన్సిక తప్ప ఇంకెవరూ లేరు. వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్‌తో రూపొందిన చిత్రమిది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే... సింగిల్ షాట్ మూవీ అని యూనిట్ సభ్యులు తెలిపారు. హాలీవుడ్ మూవీస్ 'బర్డ్ మన్', '1917' సినిమాల తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు.
హన్సిక గ్లామర్ రోల్స్ చేసినా, కొన్ని సినిమాల్లో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అయితే, సినిమాలో ఇతర క్యారెక్టర్లు కూడా ఉండటంతో ఆవిడ మీద మిగతా సన్నివేశాల్లో ఫోకస్ తక్కువ ఉంటుంది. '105 మినిట్స్'లో అలా కాదు. సినిమా మొత్తం మీద ఆవిడ తప్ప మరొకరు కనిపించరు. అందువల్ల, అందరి అటెన్షన్ హన్సిక మీద ఉంటుంది. సినిమా అంతా తన భుజాలపై ఆవిడ నడిపించాల్సి ఉంటుంది. అయితే, ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను హన్సిక ఏ మేరకు ఆకట్టుకుందనే చూడాలి. ఇండియన్ మూవీ హిస్టరీలోనూ ఈ తరహా మూవీ మొదటిది కావడం విశేషం.
Read Also: 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ - భార్య ట్వింకిల్ ఖన్నాకు అక్షయ్ కుమార్ అభినందనలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)