‘హనుమాన్’లోని ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయో తెలుసా? ‘హనుమాన్’ మూవీ ఒక విజువల్ వండర్. కానీ, అన్నీ గ్రాఫిక్సే అనుకుంటే పొరపాటే. (చివర్లో వీడియో మిస్ కావద్దు) ఎందుకంటే ఈ మూవీలో కనిపించిన కొన్ని లొకేషన్స్ నిజంగానే ఉన్నాయి. ఔనండి, నిజం. అంతేకాదు.. అవి మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటం విశేషం. ‘హనుమాన్’ మూవీలో కనిపించే భారీ విగ్రహం, పల్లెటూరు.. అంతా సెట్టింగ్సే. మూవీలో విజువల్సే కాకుండా ప్రకృతి అందాలు కూడా ప్రేక్షకుల మది దోచేస్తున్నాయి. 60 శాతం షూటింగ్ అల్లూరి సీతారామరాజు (ఒకప్పుడు విశాఖ) జిల్లాలోనే జరిగింది. అరకు, మారెడుమిల్లి, పాడేరు గ్రామాల్లో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ లొకేషన్స్ భలే అందంగా ఉంటాయి. మీరు కూడా ఫిదా అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? టైమ్ ఉన్నప్పుడు మీరు కూడా ఆ ప్రాంతాలకు టూర్ వేసేయండి. ‘హనుమాన్’ షూటింగ్ ఫైనల్ డే.. లొకేషన్ చూశారా, ఎంత బాగుందో. Images, Video Credit: Prashanth Varma/Instagram