అన్వేషించండి

Akshay Kumar: 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ - భార్య ట్వింకిల్‌ ఖన్నాకు అక్షయ్ కుమార్ అభినందనలు

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ సతీమణి ట్వింకిల్ ఖన్నా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆమెను అభినందిస్తూ అక్షయ్ సోషల్ మీడియా వేదికగా ఓ స్వీట్ నోట్ రాశారు.

Akshay Kumar About Twinkle Khanna: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసింది. లండన్‌ లోని గోల్డ్‌ స్మిత్స్‌ యూనివర్సిటీ నుంచి తాజాగా ఆమె మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యను అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తనను ప్రశంసిస్తూ ఓ ఎమోషనల్ పోస్టు రాశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

భార్యను అభినందించిన అక్షయ్ కుమార్

ఇల్లు, పిల్లలు, తనను చూసుకుంటూ మాస్టర్స్ డిగ్రీ అందుకోవడం సంతోషంగా ఉందని అక్షయ్ కుమార్ తెలిపారు. “రెండు సంవత్సరాల క్రితం చదువుకోవాలని నువ్వు నాతో చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కానీ, చాలా కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, పిల్లలు, నన్ను, నీ కెరీర్ ను చూసుకుంటూ చదువుకున్నావు. నేను సూపర్ ఉమెన్ ను పెళ్లి చేసుకున్నాను. భర్తగా ఎంత గర్వపడుతున్నాను చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలి అనుకుంటున్నాను. కంగ్రాట్స్ మై లవ్” రాసుకొచ్చారు. ఈ మేరకు ట్వింకిల్ పట్టా అందుకున్న అనంతరం ఆమెతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అక్షయ్ షేర్ చేసిన ఫోటోలో ట్వింకిల్ ఖన్నా ఆకుపచ్చ రంగు చీరలో చిరునవ్వుతో  అందంగా కనిపించింది. అక్షయ్ తన భార్యను అభినందిస్తూ పెట్టిన పోస్టుపై పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ వయసులో కుటుంబ బాధ్యతలను మోస్తూ చదువుకోవడం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. అటు తన  గ్రాడ్యుయేషన్ కు సంబంధించి ట్వింకిల్ ఖన్నా ఓ వీడియోను షేర్ చేసింది.  అక్షయ్ పోస్టుకు రిప్లై ఇచ్చింది. ఇంతగా ప్రోత్సహించే భర్త తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ఫిక్షన్ రైటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేసిన ట్వింకిల్ ఖన్నా

ప్రస్తుతం 50 ఏళ్ల వయసున్న ట్వింకిల్ ఖన్నా లండన్‌ లోని గోల్డ్ స్మిత్ యూనివర్సిటీ నుంచి ఫిక్షన్ రైటింగ్ లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్లు డింపుల్‌ కపాడియా, రాజేశ్‌ ఖన్నా దంపతుల ముద్దుల కూతురిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ట్వింకిల్ ఖన్నా. 1995లో హిందీ మూవీ ‘బర్సాత్‌’తో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘జాన్‌’, ‘దిల్‌ తేరా దీవానా’, ‘ఇంటర్నేషనల్‌ ఖిలాడి’ సహా పలు సినిమాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకూ ట్వింకిల్ ఖన్నా పరిచయమే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘శ్రీను’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఆమె సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. ప్రస్తుం అక్షయ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11).

Read Also: 'హనుమాన్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మకి షాకిచ్చిన ట్విటర్‌ - అదే కారణమా?

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today July 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖ కోసం ప్లాన్‌ చెప్పిన లక్కీ – కోపంతో రగిలిపోయిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖ కోసం ప్లాన్‌ చెప్పిన లక్కీ – కోపంతో రగిలిపోయిన ఐశ్వర్య
Illu Illalu Pillalu Serial Today July 24th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సంతోషంగా ఉన్న కుటుంబాల మధ్య కేక్ చిచ్చు పెడుతుందా! భద్రావతిని ధీరజ్ అవమానించాడా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సంతోషంగా ఉన్న కుటుంబాల మధ్య కేక్ చిచ్చు పెడుతుందా! భద్రావతిని ధీరజ్ అవమానించాడా!
Smriti Kashyap: తెలుగు బుల్లితెర 'చిన్ని' .. బెంగాలీ బ్యూటీ స్మృతి కశ్యప్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెర 'చిన్ని' .. స్మృతి కశ్యప్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Friday OTT Movies : నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Embed widget