News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tamil Actresses: ఫెయిల్యూర్స్ దాటి సక్సెస్ వైపు - లేటైనా, లేటెస్టు హిట్స్‌తో దూసుకెళ్తున్న తమిళ భామలు!

అందం, అభినయం ఉన్నా, అదృష్టం కలిసి రాకపోతే సక్సెస్ కాలేరు. అలాగే, తెలుగులో పలు సినిమాలు చేసినా, లేటుగా సక్సెస్ అందుకున్నారు పలువురు తమిళ హీరోయిన్లు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

FOLLOW US: 
Share:

సక్సెస్ అనేది అంత ఈజీగా లభించదు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. ప్రారంభంలో ఒక్క ఫెయిల్యూర్ వచ్చినా.. అవకాశాలు వెనక్కి వెళ్లిపోతాయి. అయితే, పట్టువదలకుండా ప్రతిభతో రానిస్తే.. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ఇందుకు ఈ భామలే నిదర్శనం. కెరీర్ ఆరంభంలో ఇక తమకి అవకాశాలు ఉండవని దిగులు చెందారు. ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమా, వెబ్ సీరిస్‌ల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. 

1. శృతి హాసన్

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్, కొంత కాలం గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. గతేడాది రవితేజ సరసన ‘క్రాక్‌’లో ఈ భామ అదరగొట్టింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో మెరిసింది. బాలయ్య ‘ వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ‘సలార్’లో హీరోయిన్ గా నటిస్తోంది.

2. వరలక్ష్మీ శరత్ కుమార్

శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తెలుగులో పలు సినిమాలు చేసింది. ‘క్రాక్’, ‘నాంది’ సినిమాలో మంచి హిట్స్ అందుకుంది. బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. వరలక్ష్మి తమిళంలో హీరోయిన్‌గా నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమె సినిమాలేవీ సక్సెస్ కాకపోవడంతో కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. చివరికి తెలుగులో విలన్ పాత్రలతో విజయాలను అందుకుంది. 

3. అమృత అయ్యర్

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’  తెలుగులోకి అడుగు పెట్టి, ‘రెడ్’తో ఫర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం ‘హనుమాన్’ సినిమా చేస్తోంది. ఇంతకు ముందు ఆమె పలు తమిళ సినిమాల్లో నటించినా అక్కడ చిన్న చిన్న అవకాశాలే వచ్చాయి. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ హిట్ కొడితే.. ఆమెకు అవకాశాలు కూడా పెరుగుతాయి. 

4. నివేదా పేతురాజ్

‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ‘అలా వైకుంఠపురంలో’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘విరాటపర్వం’, ‘పాగల్’ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ‘దాస్ కా ధమ్కీ’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈమె కూడా తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. కానీ, నెంబర్ వన్ కాలేకపోయింది. ప్రస్తుతం తెలుగులోనే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. 

5. సాయి పల్లవి

సాయి పల్లవి తెలుగులో బాగా రాణిస్తోంది. ఆమె నటించిన చాలా సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె పెట్టింది పేరు.  ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ తర్వాత సాయి పల్లవి ‘విరాటపర్వం’, ‘గార్గీ’ సినిమాల్లో నటించింది. అయితే, అవి పెద్దగా హిట్ కొట్టలేదు. అయితే, ఇప్పటికీ సాయి పల్లవి ఒకే అంటే.. పెద్ద సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఆమె శివకార్తికేయన్ సినిమా షూట్‌లో బిజీగా ఉంది. 

6. ఐశ్వర్య రాజేష్

తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పేరుతెచ్చుకుంది. తరువాత తెలుగులోనూ హీరోయిన్ గా నటించింది. ‘కౌసల్యా కృష్ణమూర్తి’ అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తరువాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ సినిమాలతో అలరించింది. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈమె నటించిన సినిమాలు, వెబ్ సీరిస్‌లు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ఓటీటీల్లో వాటికి మంచి క్రేజ్ లభిస్తోంది. ‘డ్రైవర్ జమున’, ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, ‘రన్ బేబీ రన్’ మూవీస్‌తో మహిళ ప్రేక్షకులను ఐశ్వర్య ఆకట్టుకుంటోంది. 

7. సంగీత

నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క చాన్స్‌ అంటూ ‘ఖడ్గం’ చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరగా 2010లో ‘కారా మజాకా’ చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో సంగీత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ‘ఆచార్య’ నిరుత్సాహ పరిచినా.. తాజాగా ‘మసూద’, ‘వారసుడు’ సినిమాల ద్వారా విజయాలను తన ఖాతాలో వేసుకుంది. 

8. రెజీనా కసాండ్రా

ఈమె కూడా తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. రీసెంట్ గా ‘నేను’, ‘శాకిని ఢాకిని’ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. త్వరలో ‘ఫ్లాష్ బ్యాక్’ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా, ‘నేనే నా’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ‘నేనే నా’ మూవీ నుంచి ఇంకా అప్‌డేట్స్ ఏవీలేవు. అయితే, ఇవి కాకుండా రెజీనా హిందీలో ‘జాన్‌బాజ్ హిందుస్థాన్‌కె’, ‘ఫర్జీ’ వెబ్ సీరిస్‌లతో సక్సెస్ అందుకుంది.

Read Also: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Published at : 21 Mar 2023 04:27 PM (IST) Tags: Regina Cassandra Shruti Haasan Varalaxmi Sarathkumar Telugu films Tamil actresses

ఇవి కూడా చూడండి

Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!

Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!

Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు

Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు

Bigg Boss Telugu 7: అమర్‌పై యావర్ డౌట్లు, ఆటలో చీటింగ్ చేశాడంటూ ఆరోపణలు!

Bigg Boss Telugu 7: అమర్‌పై యావర్ డౌట్లు, ఆటలో చీటింగ్ చేశాడంటూ ఆరోపణలు!

Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!

Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!

Animal Box Office: 'యానిమల్' బాక్సాఫీస్ రికార్డులు - మొదటి రోజు రణబీర్ సెంచరీ కొడతాడా?

Animal Box Office: 'యానిమల్' బాక్సాఫీస్ రికార్డులు - మొదటి రోజు రణబీర్ సెంచరీ కొడతాడా?

టాప్ స్టోరీస్

Telangana Assembly Election 2023: 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం 51.89

Telangana Assembly Election 2023: 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం 51.89

Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం

CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం

Telangana Elections: డబ్బులు పంచకుండా మోసం! మేం ఓటేసేది లేదు, తేల్చి చెప్పిన ఓటర్లు!

Telangana Elections: డబ్బులు పంచకుండా మోసం! మేం ఓటేసేది లేదు, తేల్చి చెప్పిన ఓటర్లు!