(Source: Poll of Polls)
YSRCP Manifesto: 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాం: జగన్
YSRCP Manifesto: చంద్రబాబు మాదిరిగా తనకు అలవి కాని హామీలు ఇచ్చే అలవాటు లేదని అమలు చేసే అవకాశం ఉన్న హామీలు ఇచ్చామన్నారు. అదే మాటకు కట్టుబడి 2019లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామన్నారు.
YSRCP Manifesto: 2019 మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశాం అన్నారు వైసీపీ అధినేత చంద్రబాబు. 2 లక్షల 77 వేల కోట్లను డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. ప్రతి రోజూ మేనిఫెస్టో చూపిస్తూనే ప్రజల్లోకి వెళ్లాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మేనిఫెస్టో పంచాం. గత ఐదేళ్లలో మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేశాం. ఏ నెల ఏ పథకం ఇస్తున్నామో చెప్పి మరీ ప్రజలకు అందించాం.
తాము మేనిపెస్టోలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో చేసిన పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను అన్నింటినీ మేనిఫెస్టలో పెట్టి అమలు చేశాం. కొన్ని ప్రకృతి వైపరిత్యాల వల్ల, కరోనా లాంటి విపత్తు వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నా ఎక్కడా సాకులు చూపించలేదు. ప్రజలకు తోడుగా ఉన్నాం... ప్రజలకు అండగా నిలబడ్డాం. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తూ... ప్రతి సంవత్సరం అది ప్రజల వద్దకు పంపించాం. ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుంా బటన్ నొక్కి వారి ఖాతాల్లో వేస్తున్నాం. ఎవరికైనా రాకుండా వాళ్లకి కూడా ఛాన్స్ ఇచ్చాం. భారత దేశ చరిత్రలోనే ఇలా జరగలేదు.
మంచి చేయడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా గడపగడపకు పేరుతో ప్రజల వద్దకు పంపించాం. జరిగిన మంచిని వివరించాం. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్లు అవి చేయకపోతే... పేదల బతుకులు ఎలా చిన్నా భిన్నం అవుతాయో అనడానికి చంద్రబాబు ప్రభుత్వమే ఉదాహరణ.
2019లో కూటమిగా పోటీ చేసిన ఈ పార్టీలే ముఖ్యమైన హమీలు అంటూ చెప్పిన వాటి అమలు గురించి మరిచిపోయారన్నారు జగన్. ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని మొదటి సారిగా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 2 లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాం. సామాజిక న్యాయాన్ని చేసి చూపించాం. నా అని పిలుచుకునే అన్న వర్గాలకు న్యాయం చేశాం. 200 స్థానాలకు 50 శాతం అంటే వంద స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించాం.
పల్లెటూరి పిల్లలు ఐక్యరాజ్య సమతికి కూడా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇప్పుడు ఐబీతో మొదలవుతుంది ప్రయాణం మొదలవుతుంది. మరో పదేళ్లు ఇదే పాలన కొనసాగితే జరిగే మార్పు గమనించాలి. ప్రపంచలో పేరున్న విశ్వవిద్యాలయాల్లో ఉండే కోర్సులు ఇక్కడ ప్రవేశ పెడుతున్నాం.
విద్యా రంగంలో మొదలు పెడితే... వైద్య, వ్యవసాయ, మహిళా సాధికారకత విషయంలో, వృద్ధుల సంక్షేమంలో సామాజిక న్యాయం చేశాం. కనీవినీ ఎరుగని మార్పులు కనిపిస్తున్నాయి.