![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
central ministers from Telugu states : తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులెవరు ? కూటమి పార్టీలకు పదవులెన్ని ?
Central Cabinet : కేంద్రంలో మోదీ నేతృత్వంలో మూడో సారి ప్రబుత్వం ఏర్పడబోతోంది. అయితే ఈ సారి నిజమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోంది. తెలుగు రాష్ట్రాలకు కీలక పదవులు దక్కనున్నాయి.
![central ministers from Telugu states : తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులెవరు ? కూటమి పార్టీలకు పదవులెన్ని ? Who are the central ministers from Telugu states central ministers from Telugu states : తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులెవరు ? కూటమి పార్టీలకు పదవులెన్ని ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/46bddb26cadb85ff2d2eb0becbe286cd1717582012767228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Who are the central ministers from Telugu states : కేంద్రంలో మూడో సారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతోంది. గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ బీజేపీకి సంపూర్ణమైన మెజార్టీ ఉండేది.అందుకే మిత్రపక్షాలకు పెద్దగా ప్రాధాన్యం లభించేది కాదు. ఈ కారణంగా గత ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కిషన్ రెడ్డి మాత్రమే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి ఎవరూ లేరు. ఐదేళ్ల పాటు కేంద్ర మంత్రి లేని రాష్ట్రంగా ఏపీ ఉంది. కానీ ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి వర్గంలో మంచి ప్రాధాన్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు చాన్స్ గ్యారంటీనా ?
కేంద్రంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది. కింగ్ మేకర్ తరహాలో ప్రభుత్వం నిలబడటానికి టీడీపీ మద్దతు కీలకం కావడంతో చంద్రబాబునాయుడు టీడీపీ కోసం కీలకమైన పదవుల్ని అడిగుతున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాి. లోక్ సభ స్పీకర్ పదవితో పాటు మూడు కేంద్రమంత్రి పదవుల్ని చంద్రబాబు అడుగుతున్నట్లుగా హస్తిన మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. కేంద్రమంత్రి పదవులు వస్తే.. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జనసేన పార్టీ తరపున ఇద్దరు ఎంపీలు గెలిచారు. వారిలో ఒకరికి చాన్స్ వస్తే.. సీనియర్ అయిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం లభిస్తుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'పేటీఎం బ్యాచ్' ఇప్పుడేం చేస్తుంది? వైసీపీకి వ్యతిరేకంగా ప్లేట్ తిప్పేస్తే?
ఇక బీజేపీ తరపున పురందేశ్వరికి పదవి ?
ఇక బీజేపీకి కూడా ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్ల విజయం సాధించింది. పురందేశ్వరి, సీఎం రమేష్, శ్రీనివాసవర్మ ఎంపీలుగా గెలిచారు. వీరిలో పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఆమెకు హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది. అలాగే సీఎం రమేష్ కు కూడా ప్రధానమంత్రి వద్ద ప్రయారిటీ ఉంది. ఆయన కూడా కేంద్ర మంత్రి లో ఉండే అవకాశం ఉంది. అయితే టీడీపీ, జనసేనకు కూడా పదవులు ఇవ్వాల్సి ఉన్నందున బీజేపీ ముగ్గురు ఎంపీల్ల్లో ఒక్కరికే చాన్స్ లభిస్తుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
ఎన్నాళ్లో వేచిన ఉదయం...అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన పయ్యావుల కేశవ్
తెలంగాణ నుంచి బీజేపీ సీనియర్ నేతలకు చాన్స్
ఈ సారి తెలంగాణ నుంచి కూడా ఒకరిద్దరికి అవకాశం లభించనుంది. ఇప్పటి వరకూ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన మరోసారి గెలిచారు. గెలిచిన వారిలో డీకే అరుణ మరో సీనియర్ నేతగా ఉన్నారు. బండి సంజయ్‌కు ప్రధానమంత్రి వద్ద పలుకుబడి ఉంది. ధర్మపురి అరవింద్ వరుసగా రెండో సారి గెలిచారు. వీరిలో ఒకరిద్దరికి కేంద్ర మంత్రి పదవులు లభించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)