UP Election 2022: 'ఆ పాలకులు యూపీని కొల్లగొట్టారు- అందుకే ప్రజలు వెళ్లగొట్టారు'
ఉత్తర్‌ప్రదేశ్‌ను పాలించిన గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని కొల్లగొట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. కాన్పుర్‌లో జరిగిన బహిరంగ సభలో సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు. తొలి విడత పోలింగ్ ట్రెండ్‌ను పరిశీలిస్తే రాష్ట్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందని మోదీ అన్నారు.
Before 2017, UP had ration scams every other day. They made lakhs of fake ration cards. Double engine govt ended this fake ration card scheme. Today, crores of the UP public are receiving ration free of cost. Stoves of my poor sisters & mothers will never be turned off: PM Modi pic.twitter.com/jAleSi1Vll
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 14, 2022
7 విడతల్లో
403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగగా, ఫిబ్రవరి 14న రెండో విడత జరుగుతోంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Also Read: Covid Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 34,113 మందికి వైరస్