UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ఆరో విడత పోలింగ్- యోగి బరిలోకి దిగిన స్థానంపైనే అందరి చూపు
UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53 శాతం ఓటింగ్ నమోదైంది.
![UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ఆరో విడత పోలింగ్- యోగి బరిలోకి దిగిన స్థానంపైనే అందరి చూపు UP Election 2022: 53.31 Percent Voter Turnout Recorded Across 57 Seats in sixth phase of Polling UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ఆరో విడత పోలింగ్- యోగి బరిలోకి దిగిన స్థానంపైనే అందరి చూపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/03/f698c7b818402cd624cb1b912d8c8760_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసిన గోరఖ్‌పుర్ సహా పూర్వాంచల్ ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఈ విడతలో ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 53.31 శాతం పోలింగ్ నమోదైంది.
ఆ స్థానంపైనే
మొత్తం పది జిల్లాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసిన గోరఖ్‌పుర్ నియోజకవర్గంవైపే అందరి చూపు ఉంది. ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్ గోరఖ్‌పుర్ అర్బన్ నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా పోటీ చేశారు.
'नए उत्तर प्रदेश' की अविराम विकास यात्रा के लिए मतदान अवश्य करें।
— Yogi Adityanath (@myogiadityanath) March 3, 2022
भारत माता की जय! pic.twitter.com/XdUTzWqdmM
ఆ నియోజకవర్గంలోని కన్యా నగర్ క్షేత్రలోని పోలింగ్ కేంద్రం వద్ద సీఎం యోగి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం తథ్యమని యోగి ధీమా వ్యక్తం చేశారు.
ప్రముఖులు వీరే
ఈ విడత ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు మంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
- సూర్యప్రతాప్ షాహీ
- సతీశ్ చంద్ర ద్వివేది
- జైప్రతాప్ సింగ్
- శ్రీరాం చౌహాన్
- జైప్రకాశ్ నిషాద్
విపక్ష నేతలు
- ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య
- యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ
- అసెంబ్లీలో విపక్ష నేత రామ్ గోవింద్ చౌదరి
ఎస్పీ ధీమా
మరోవైపు ఈ విడత ఎన్నికల్లోనూ సమాజ్‌వాదీదే పై చేయని ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాను ఓడించి సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
యూపీలో ఏడో విడత పోలింగ్ మార్చి 7న జరగనుంది. అనంతరం మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read: Russia Ukraine War: అలాంటిదేం లేదు, ఉక్రెయిన్‌లో మా విద్యార్థులు బందీలుగా లేరు: భారత్
Also Read: Russia Ukraine War: ఇది వాళ్ల టైం- బైడెన్‌ను చేతకానివాడిగా చూస్తున్నారు: ట్రంప్ షాకింగ్ కామెంట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)