UP Election 2022: కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్‌పై యాసిడ్ దాడి.. పార్టీ కార్యాలయంలోనే!
ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువనేత కన్హయ్య కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తి కెమికల్‌తో దాడి చేశాడు.
కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్‌పై కొంతమంది రసాయన దాడి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) కార్యాలయం వద్దే ఈ దాడి జరిగింది. పార్టీ నిర్వహించిన యువ సన్సద్ కార్యక్రమంలో కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. ఆ సయంలోనే ఈ దాడి జరిగింది.
దాడి చేసిన వ్యక్తిని వెంటనే పార్టీ కార్యకర్తలు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. దాడి చేసిన వ్యక్తి పేరు దేవాన్ష్ భాజ్‌పేయీగా గుర్తించారు. కన్హయ్య కుమార్‌పై రసాయనాన్ని విసురుతోన్న సమయంలో కార్యకర్తలు అతడ్ని పట్టుకున్నారు.
యాసిడ్ దాడా?
అయితే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. కన్హయ్య కుమార్‌పై యాసిడ్ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. కానీ పోలీసులు మాత్రం అది యాసిడ్ కాదని.. ఇంక్ అని పేర్కొన్నారు. కన్హయ్య కుమార్.. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరుఫున ప్రచారకర్తగా ఉన్నారు.
ఎవరీ కన్హయ్య..?
కన్హయ్య కుమార్.. బిహార్ బెగుసరాయ్‌కు చెందిన సీపీఐ నేతల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెగుసరాయ్ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీకి చెందిన గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆర్‌జేడీ అభ్యర్థి కంటే కన్హయ్య కుమార్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన అనేక నిరసనల్లో ఆయన ప్రసంగించారు. అయితే బిహార్ ఎన్నికల ప్రచారంలో మాత్రం అంత చురుగ్గా వ్యవహరించలేదు. 2021లో కన్హయ్య కుమార్.. కాంగ్రెస్‌లో చేరారు.
Also Read: UP Election 2022: యూపీ మాజీ మంత్రులు మౌర్య, అభిషేక్ మిశ్రాకు టికెట్లు ఇచ్చిన ఎస్పీ
Also Read: Jharkhand Coal Mine Accident: ఘోర ప్రమాదం.. బొగ్గు గనిలో ఆరుగురు మృతి