అన్వేషించండి

Satya Sai District News: సత్యసాయి జిల్లా టీడీపీలో టికెట్ల టెన్షన్- నాన్చుడేనా తేల్చుడు ఉందా?

తెలుగుదేశం పార్టీ అధిష్టానం సత్యసాయి జిల్లాలో ఇప్పటివరకు కేవలం మూడు నియోజకవర్గాలపైనే క్లారిటీ ఇచ్చింది. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఎక్కువగా కనిపిస్తున్నారు.

Satya Sai District News: సత్య సాయి జిల్లా టిడిపి తొలి జాబితాపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తైంది. మిగిలిన నాలుగు నియోజకవర్గాల నేతల్లో టెన్షన్ నెలకొంది. హిందూపురం ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై టిడిపి శ్రేణుల్లో చర్చ కొనసాగుతోంది. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ తమకే టికెట్ వస్తుందంటూ ఆశావహులు ప్రచార పనుల్లో మునిగిపోయారు. 

మూడింటిపై క్లారిటీ

తెలుగుదేశం పార్టీ అధిష్టానం సత్యసాయి జిల్లాలో ఇప్పటివరకు కేవలం మూడు నియోజకవర్గాలపైనే క్లారిటీ ఇచ్చింది. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకే వడపోత ప్రక్రియ కొనసాగిస్తోంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. హిందూపురం, కదిరి, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గం ఈ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే హిందూపురం నుంచి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొనసాగుతున్నారు. కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా కందికుంట వెంకట ప్రసాద్ చంద్రబాబు నాయుడు దాదాపుగా ఖరారు చేశారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల కుటుంబం నుంచి ఎవరో ఒకరు బరిలో ఉంటారని స్పష్టమైనది. 

సామాజిక సమీకరణాలతో మారుతున్న లెక్కలు

పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, మడకశిర నియోజకవర్గలకు సంబంధించి పూర్తి స్పష్టత రాలేదు. టికెట్ తమదే అంటూ ఇన్చార్జిలు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. వారి ప్రచారంపై అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. బిసి, మైనార్టీ, మహిళ వంటి అంశాలకు ప్రాధాన్యతా క్రమంలో అధికార వైఎస్‌ఆర్‌సీపీ తమ అభ్యర్థులను ఎంపిక చేసింది. దీంతో టిడిపి తన అభ్యర్థులను సామాజిక సమీకరణాలతో ఎంపిక చేయాలని ఆలోచనకు రావడం సమస్యగా మారింది. 

వాళ్లిద్దరికి టికెట్ దక్కుతుందా?

పెనుకొండ నియోజవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బి.కె పార్థసారథి, కురుభ సవితమ్మా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మడకశిర నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నకి మరో అవకాశం కలిపిస్తారా లేక కొత్త అభ్యర్థి అవకాశం కలిపిస్తారా అన్నది తేలియాల్సి ఉంది. ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్‌గా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. ఈ సెగ్మెంట్ నుంచే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కూడా టికెట్ కోరుకుంటున్నారు. దీంతో ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. పుట్టపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ గా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారా లేక వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తారా అన్నది స్పష్టత రావలసిఉంది. పుట్టపర్తి టికెట్ రేసులో మరికొందరు నేతలు లేక పోలేదు.   

చంద్రబాబు నాన్చుతారనే అపవాదు

సత్యసాయి జిల్లాలో ఇప్పటివరకు టిడిపి కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే బీసీ అవకాశం ఇవ్వగా ఎమ్మెల్యేలకు సంబంధించింది చాలా తక్కువ అవకాశాలు ఉండేవి. ఇదే సందర్భంలో మైనార్టీ విషయంలో కూడా ఇదే సమస్య టిడిపిని వెంటాడుతోంది. వీటన్నిటిపై చంద్రబాబు పూర్తిగా కసరత్తు చేసి మరో 4,5 రోజుల్లో తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టిడిపి నాయకులు పేర్కొంటున్నారు. 
తొలి జాబితాలో జిల్లాకు సంబంధించి అన్ని స్థానాలకు క్లారిటీ ఇస్తారా లేక మరికొన్ని స్థానాలకు గడువు తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టికెట్ల విషయంలో మొదటి నుంచి నాన్చుడు ధోరణితో ఉంటూ అభ్యర్థులను టెన్షన్ పెట్టడం మామూలే అంటున్నారు పార్టీ లీడర్లు. పవన్, చంద్రబాబు క్లారిటీకి వచ్చిన తర్వాతే అభ్యర్థులపై స్పష్టత వస్తుంది. ఈ నాన్చుడు ధోరణిలో మార్పు వస్తుందని మాత్రం నేతలు నమ్ముతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget