Telangana New CM: రేపే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు! నేడు రాత్రికి సీఎల్పీ మీటింగ్
Telangana New CM: తెలంగాణలో కొత్త సీఎం రేపు (డిసెంబర్ 3) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది.
తెలంగాణ రాష్ట్రంలో కొద్ది వారాలుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మూడో సారి కూడా అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలను గులాబి పార్టీని తిరస్కరించారు. మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల కాకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఊహించని దాని కంటే చాలా తక్కువ స్థానాలు గెల్చుకుంది.
దీంతో తెలంగాణలో కొత్త సీఎం రేపు (డిసెంబర్ 3) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ఇప్పటికే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అందర్నీ తాజ్ క్రిష్ణా హోటల్ కు తరలిస్తున్నారు. ఈ రాత్రికి సీఎల్పీ సమావేశం ఉండే అవకాశం ఉంది. దీంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ సేకరించనుంది. రేపటిలోగా సీఎం పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు గవర్నర్‌ను కాంగ్రెస్ పార్టీ కలవనుంది.
అయితే, డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్ రెడ్డి గతంలోనే వెల్లడించారు. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు కావడం విశేషం. సోనియా గాంధీని పార్టీ నేతలు అందరూ సోనియమ్మగా ఆరాధించే సంగతి తెలిసిందే. అందుకే ప్రమాణ స్వీకారానికి ఆ ప్రత్యేకమైన రోజును ఎంపిక చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత రాగానే సీఎం కేసీఆర్ రాజీనామా చేసేయడంతో ఇక వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుస్తోంది.