TS Lok Sabha Election Results 2024 Live Updates: తెలంగాణలో కాంగ్రెస్ Vs బీజేపీ - గాంధీ భవన్లో కాంగ్రెస్ సంబరాలు
Telangana Lok Sabha Election Results 2024 Live Updates: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.
LIVE

Background
TS Lok Sabha Election Results 2024 Live Updates : ఎంపీ ఫలితాలతో నిరాశ చెందాల్సిన అవసరం లేదు - హరీశ్
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 24 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పనిలేదు.
కమలం 8 సీట్లు గెలువడానికి BRS కారణమంటున్న బీజేపీ నేతలు
బీజేపీ 8 సీట్లు గెలువడంలో BRS ఫెయిల్యూర్ మాత్రమే. కేసీఆర్ ఇక్కడి రైతులను పట్టించుకోకపోవడం వల్లనే బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కలేదని బీజేపీ నేతలను వ్యాఖ్యానిస్తున్నారు.
TS Lok Sabha Election Results 2024 Live Updates : గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబరాలు
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు టపాకాయలు కాల్చి, డ్యాన్స్‌లు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వలేదని ఆనందం వ్యక్తం చేశారు.
TS Lok Sabha Election Results 2024 Live Updates : బీఆర్ఎస్ కంచుకోటలో విరిసిన కమలం
బీఆర్ఎస్ కంచుకోటైనా మెదక్‌లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ రావు 33 వేల మెజారిటీతో గెలుపొందారు.
కరీంనగర్ రికార్డు బద్దలు కొట్టిన బండి సంజయ్
కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ అత్యధిక మెజారిటీ సాధించారు. మరో 4 రౌండ్లు ఉండగానే 2006లోని కేసీఆర్ రికార్డును, 2014లో వినోద్ రికార్డులను బండి సంజయ్ బీట్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

