DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
Telangana Election Results 2023: పార్టీకి ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. శనివారం రాత్రి ఆయన హైదరాబాద్ కు రానున్నారు.
DK Shivakumar to focus on Telangana Congress MLAs: హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడగా రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తున్నా, ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనన్న టెన్షన్ పట్టుకుంది. దాంతో పార్టీకి ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar ) ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. కర్ణాటక కాంగ్రెస్ లో అగ్రనేతల్లో ఒకరైన డీకే శివకుమార్ శనివారం రాత్రి 11:30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారని సమాచారం. రాత్రి ఆయన తాజ్ కృష్ణలో బస చేస్తారు. ఆదివారం (డిసెంబర్ 3న) తాజ్ కృష్ణ (Taj Krishna) నుంచి కౌంటింగ్ ప్రక్రియను డీకే పరిశీలించనున్నారు. మరికొందరు ఏఐసీసీ నేతలు ఆదివారం ఉదయం తెలంగాణకు రానున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులకు ఏఐసీసీ ఆదేశాలు
కౌంటింగ్ కేంద్రాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు బయటకు రావద్దని ఏఐసీసీ ఆదేశించింది. ఏఐసీసీ పరిశీలకులు కూడా నిర్ణీత కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉండాలని సూచించింది. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థులు చేజారుతారని అధిష్టానానికి టెన్షన్ తప్పడం లేదు. అభ్యర్థులు ప్రలోభాలకు గురికావొద్దంటే గెలించిన వెంటనే వారిని హైదరాబాద్ రప్పించాలని యోచిస్తోంది. తాజ్ కృష్ణలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఏఐసీసీ ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
హైదరాబాద్ కు డీకే శివకుమారే ఎందుకంటే..
కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు వారిని కాపాడుకునేందుకు రిసార్ట్ రాజకీయాలు చేయడం డీకే శివకుమార్ కు చాలా చిన్న విషయం. కర్ణాటకలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఏఐసీసీ బాధ్యతలు అప్పగించగా తమిళనాడు రిసార్ట్స్ అటు నుంచి హైదరాబాద్ హోటల్స్ కు కూడా పార్టీ ఎమ్మెల్యేలను తరలించి గోడ దూకకుండా కాపాడుకున్నారు. మరోసారి పార్టీ ఎమ్మెల్యేలను గోవా లాంటి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన సమర్థుడుగా డీకేకు మంచి పేరుంది. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థులను హైదరాబాద్ కు రప్పిస్తే కనుక వారికి పార్టీకి చెందిన డీకే శివకుమార్ మనుషులు కాపలా ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ రాకపోతే ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా, వేరే పార్టీ ప్రలోభాలకు లోనుకాకుండా చూసే బాధ్యతలను కర్ణాటక డిప్యూటీ సీఎంకు అప్పగించారని పార్టీ వర్గాల సమాచారం.
ఏబీపీ సీ ఓటర్ ఎగ్టిజ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో అధిక సీట్లు రానున్నాయి. అధికారంలోకి సైతం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అత్యధిక సీట్లు తెచ్చుకున్నా కాంగ్రెస్ కు మెజార్టీ ఫిగర్ 60 సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటని ఏఐసీసీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలను గేటు దాటకుండా, వేరే పార్టీలోకి వెళ్లకుండా కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి నమ్మకమైన నేతలతో హైదరాబాద్ లో క్యాంప్ రాజకీయాలు నడిపేందుకు అంతా ప్లాన్ రెడీ చేశారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply