అన్వేషించండి

Hyderabad Assembly Election Results 2023: హైదరాబాద్ లో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Hyderabad Assembly constituencies winners: హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఏడాది (2023) గెలిచిన, ఓడిన అభ్యర్థుల జాబితా ఇక్కడ చూడొచ్చు. 2014, 2018 అభ్యర్థుల జాబితా కూడా మీకోసం...

Telangana Election Results 2023  Hyderabad Assembly constituencies winners and losers

హైదరాబాద్ లో ఉన్న మొత్తం నియోజకవర్గాల్లో   2023 ఎన్నికల్లో గెలుపు ఓటములు ఇక్కడ చూడొచ్చు...
 
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌   (హైదరాబాద్)
 
2023 లో సికింద్రా బాద్ కంటోన్మెంట్ రిజర్వుడ్‌ నియోజకవర్గం  నుంచి బరిలో దిగిన BRS అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు.    2018లో  జి.సాయన్న ఐదోసారి విజయం సాధించారు. ఆయన గతంలో నాలుగుసార్లు టీడీపీ పక్షాన, ఈసారి టిఆర్‌ఎస్‌ తరుపున గెలిచారు. 2014లో ఆయన టీడీపీ అభ్యర్దిగా గెలుపొందినా, తదుపరి జరిగిన పరిణామాలలో టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తిరిగి ఈసారి టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్దిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై 37568 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. 
 
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌   (హైదరాబాద్)
 
                        విజేత                                      ప్రత్యర్థి
2023               లాస్య నందిత (బీఆర్ఎస్)   
2018                సాయన్న ( టీఆర్ఎస్)      సర్వే సత్యనారాయణ ( కాంగ్రెస్)
2014               సాయన్న( టీడీపీ)                 గజ్జెల నగేష్ (  టీఆర్ఎస్)
 
 
సికింద్రాబాద్‌ నియోజకవర్గం (హైదరాబాద్)
 
2023 లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ మరోసారి గెలిచారు..సమీప కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ కుమార్ పై గెలుపొందారు... సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న పద్మారావుగౌడ్‌ 2018లోనూ విజయం సాధించారు.   సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు.  సికింద్రాబాద్‌ శాసనసభ నియోజకవర్గంలో ప్రముఖ  సినీనటి జయసుధ కాంగ్రెస్‌ ఐ పక్షాన 2009లో టిడిపి నేత  శ్రీనివాస యాదవ్‌ పై  గెలిచారు. ఆమె 2014లో  ఓటమి చెందారు. ఇక్కడ ఈమె సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయారు. టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత టి.పద్మారావు గౌడ్‌ 2014లో  టిడిపి -బిజెపి కూటమి అభ్యర్ధి కె. వెంకటేష్‌గౌడ్‌ను 25979  ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. 
 
సికింద్రాబాద్‌ నియోజకవర్గం (హైదరాబాద్)
 
                               విజేత                                      ప్రత్యర్థి
2023               టి.పద్మారావు (బీఆర్ఎస్)    ఎ.సంతోష్ కుమార్ ( కాంగ్రెస్)
2018                టి.పద్మారావ్ గౌడ్ ( టీఆర్ఎస్)     టి.జ్ఞానేశ్వర్ ( కాంగ్రెస్)
2014                టి.పద్మారావ్ గౌడ్ ( టీఆర్ఎస్)    కె.వెంకట్ గౌడ్ ( టీడీపీ)
 
 
బహదూర్‌పుర నియోజకవర్గం (హైదరాబాద్)
 
2023 లో  బహుదూర్ పుర నియోజకవర్గం నుంచి MIM అభ్యర్థి మహ్మద్ ముబీన్  గెలిచారు.  2018 లో ఈ  నియోజకవర్గం నుంచి నాలుగోసారి మజ్లిస్‌ నేత మౌజం ఖాన్‌ విజయం సాధించారు.  మౌజంఖాన్‌ ఈ ఎన్నికలో 82518 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఆయనకు 96993 ఓట్లు రాగా, సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ది ఇనాయత్‌ అలీ బక్రీకి 14475 ఓట్లు వచ్చాయి. 
 
బహదూర్‌పుర నియోజకవర్గం (హైదరాబాద్)
                                        విజేత                             ప్రత్యర్థి
2023                      మహ్మద్ ముబీన్ (ఎఐఎం)
2018                      మౌజం ఖాన్ ( ఎంఐఎం)     ఇనాయత్ అలీ ( టీఆర్ఎస్)
2014                      మౌజం ఖాన్ (ఎంఐఎం)       రహమాన్  ( టీడీపీ)
 
 
యాకుత్‌పురా నిజయోకవర్గం  (హైదరాబాద్)
 
యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి మజ్లిస పక్ష అభ్యర్దిగా అహ్మద్‌ పాషా ఖాద్రి 2018 లో నాలుగోసారి గెలిచారు. ఆయన అంతకుముందు మూడుసార్లు చార్మినార్‌ నుంచి విజయం సాధించారు. యాకుత్‌పుర నుంచి ఐదుసార్లు గెలిచిన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ చార్మినార్‌కు మారి ఆరోసారి గెలవగా, అక్కడ నుంచి యాకుత్‌పురాకు ఖాద్రి మారి నాలుగో సారి గెలిచారు. ఫాషా ఖాద్రి తన సమీప టిఆర్‌ఎస్‌ అభ్యర్ది సామా సుందర్‌ రెడ్డిపై 46978  ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఫాషా ఖాద్రీకి 59595 ఓట్లు రాగా, సుందర్‌రెడ్డికి 22517 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎమ్‌.బి.టి పక్షాన పోటీచేసిన మజీదుల్లాఖాన్‌కు 20400 ఓట్లు వచ్చాయి. అహ్మద్‌ పాషా ఖాద్రి ముస్లిం వర్గం నేత. 1957, 1962లలో మాత్రమే కాంగ్రెస్‌ ఇక్కడ గెలిచింది. 1962 నుంచి ఇక్కడ ఆ పార్టీకి అవకాశం రాలేదు. 1972లో ఇక్కడ గెలిచిన సలాఉద్దీన్‌ ఓవైసీ చార్మినార్‌, పత్తర్‌గట్టిల నుంచి మరో నాలుగుసార్లు గెలిచారు. 
 
యాకుత్‌పురా నిజయోకవర్గం  (హైదరాబాద్)
                                  విజేత                          ప్రత్యర్థి
2023
2018                ఫాషా ఖాద్రి ( ఎంఐఎం)         సుందర్ రెడ్డి ( టీఆర్ఎస్)
2014                 ముంతాజ్ ఖాన్ (ఎంఐఎం)  రూప్ రాజ్  ( బీజేపీ)
 
 
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం  (హైదరాబాద్)
 
శాసనసభలో మజ్లిస్‌  పక్ష నేత, మజ్లిస్‌ పార్టీ అదినేత అసదుద్దీన్‌ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి 2023 లోనూ వరుసగా ఆరోసారి గెలిచారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరసగా 1999 నుంచి గెలుస్తున్నారు. అక్బరుద్దీన్‌ తండ్రి సలావుద్దీన్‌ ఆరుసార్లు లోక్‌ సభకు, ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు అసదుద్దీన్‌ ఒవైసీ రెండుసార్లు శాసనసభ, నాలుగు సార్లుగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 
 
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం  (హైదరాబాద్)
                            విజేత                                              ప్రత్యర్థి
2023                అక్బరుద్దీన్ ఓవైసీ ( ఎంఐఎం)   
2018               అక్బరుద్దీన్ ఓవైసీ ( ఎంఐఎం)     సయ్యద్ సాహీబాజీ  ( బీజేపీ)
2014               అక్బరుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం)      ఖయ్యు ఖాన్ (ఎమ్ బీ టీ)
 
 
చార్మినార్‌ నియోజకవర్గం (హైదరాబాద్)
 2023 లో చార్మినార్ నియోజకవర్గం నుంచి MIM అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ ....సమీప బీజేపీ ప్రత్యర్థి మేఘారాణి అగర్వాల్ పై విజయం సాధించింది....
మజ్లిస్‌ పార్టీ నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ చార్మినార్‌ నియోజకవర్గం నుంచి 2018లో గెలిచారు. అంతకుముందు ఆయన యాకుత్‌ పుర నుంచి ఐదుసార్లు గెలిచారు. చార్మినార్‌లో గతంలో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషా యాకూత్‌ పురాకు మారి నాలుగోసారి విజయం సాధించారు.  2018 లో అహ్మద్‌ ఖాన్‌ తన సమీప బీజేపీ ప్రత్యర్ది ఉమా మహేంద్ర పై 32886 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఐ తరపున పోటీచేసిన మహ్మద్‌ గౌస్‌కు 15700 ఓట్లు వచ్చాయి. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు 53808 ఓట్లు రాగా, ఉమా మహేంద్ర కు 21222 ఓట్లు వచ్చాయి.అహ్మద్‌ ఖాన్‌ ముస్లిం నేత. హైదరాబాద్‌లోని చారిత్రాత్మకమైన చార్మినార్‌ శాసనసభ నియోజకవర్గంలో 1967 నుంచి కేవలం మజ్లిస్‌ పక్షమే గెలుస్తోంది. కొన్నిసార్లు ఇండిపెండెంట్లు గెలిచినట్లు రికార్డులు చెబుతున్నా, ఆ ఇండిపెండెంట్లు కూడా మజ్లిస్‌ పక్షంవారే.
 
చార్మినార్‌ నియోజకవర్గం (హైదరాబాద్)
                                     విజేత                                          ప్రత్యర్థి
2023                  మీర్ జుల్ఫీకర్ అలీ (ఎంఐఎం)          మేఘారాణి అగర్వాల్ ( బీజేపీ)
2018                  ముంతాజ్ అహ్మద్ ఖాన్ (ఎంఐఎం)    ఉమా మహేంద్ర ( బీజేపీ)
2014                  షాషా ఖాద్రి (ఎంఐఎం)                        ఎమ్.ఎ.బాసిత్ (టీడీపీ)
 
గోషామహల్‌  నియోజకవర్గం (హైదరాబాద్)
 
2023 లోనూ గోషామహల్‌ నియోజకవర్గంలో  సిట్టింగ్  ఎమ్మెల్యే రాజాసింగ్‌ మూడోసారి గెలిచారు. 2018లో  బీజేపీ తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇది. రాజాసింగ్‌ తన సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ది,మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్‌ పై 17734 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 
 
గోషామహల్‌  నియోజకవర్గం
                                             విజేత                                 ప్రత్యర్థి
2023                          రాజా సింగ్ (బీజేపీ) 
2018                         రాజా సింగ్ (బీజేపీ)               ప్రేమ్ సింగ్ రాథోడ్ ( టీఆర్ఎస్)
2014                         రాజా సింగ్ (బీజేపీ)                 ముఖేష్ ( కాంగ్రెస్ ఐ)
 
కార్వాన్  నియోజకవర్గం (హైదరాబాద్)
 
2018 లో జరిగిన ఎన్నికల్లో కార్వాన్‌ నియోజకవర్గంలో మజ్లిస్‌ పార్టీ అభ్యర్ధి, సిటింగ్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, బిజెపి నేత అమర్‌సింగ్‌పై 49692 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇక్కడ టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన టి.జీవన్‌ సింగ్‌కు సుమారు 24600 ఓట్లు వచ్చాయి. టిఆర్‌ఎస్‌, మజ్లిస్‌లు స్నేహపక్షాలే అయినా, హైదరాబాద్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా టిఆర్‌ఎస్‌ తన సొంత అభ్యర్దులను పెట్టడం ద్వారా మజ్లిస్‌కు సహకరించిందనుకోవచ్చు. మొయినుద్దీన్‌కు 85401ఓట్లు రాగా, అమర్‌సింగ్‌కు 35709 ఓట్లు వచ్చాయి. మొయినుద్దీన్‌ ముస్లిం నేత. కార్వాన్‌ నియోజకవర్గంలో 2014లో మజ్లిస్‌ ఈసారి సిటింగ్‌ ఎమ్మెల్యే అప్సర్‌ ఖాన్‌కు కాకుండా కొత్త అభ్యర్ధి మొయినుద్దీన్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈయన భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డిని ఓడిరచారు. 
 
కార్వాన్   నియోజకవర్గం
                                                  విజేత                          ప్రత్యర్థి
2023
2018కౌసర్ మొయినుద్దీన్ ( మజ్లిస్)టి.అమర్ సింగ్ ( బీజేపీ)
2014 కౌసర్ మొయినుద్దీన్ ( ఎంఐఎం) బాల్ రెడ్డి ( బీజేపీ) 
 
నాంపల్లి  నియోజకవర్గం (హైదరాబాద్)
 
2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అసిఫ్‌నగర్‌ నియోజకవర్గం రద్దై నాంపల్లి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. 2018లో జరిగిన ఎన్నికల్లో  నాంపల్లి నియోజకవర్గంలో మజ్లిస్‌ నేత జాఫర్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది ఫిరోజ్‌ ఖాన్‌పై 9700 ఓట్ల  మెజార్టీతో గెలుపొందారు. పిరోజ్‌ ఖాన్‌ గతంలో ఫిరోజ్‌ ఖాన్‌ ప్రజారాజ్యం, టీడీపీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కాంగ్రెస్‌ ఐ టిక్కెట్‌పై ప్రయత్నించినా లాభం దక్కలేదు. జాఫర్‌ హుస్సేన్‌కు 57940 ఓట్లు రాగా, పిరోజ్‌ ఖాన్‌కు 48265 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన సిహెచ్‌ ఆనందకుమార్‌కు సుమారు పదిహేడు వేల ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో 2014లో  మజ్లిస్‌ పార్టీ   విరాసత్‌ రసూల్‌ఖాన్‌ను మార్చి జాఫర్‌ హుస్సేన్‌కు అవకాశం ఇచ్చింది. రసూల్‌ ఖాన్‌ ఇక్కడ ఒకసారి గెలవగా, గతంలో రెండుసార్లు అసిఫ్‌నగర్‌ నుంచి ఒకసారి చార్మినార్‌ నుంచి విజయం సాధించారు.  కొత్త నియోజకవర్గంగా నాంపల్లి ఏర్పడినప్పటినుంచి  ముస్లింలే గెలుపొందారు. 2009లో రద్దు అయిన అసిఫ్‌నగర్‌ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఏడుసార్లు, ఇండిపెండెంట్లు నాలుగు సార్లు, ఎమ్‌.ఐ.ఎమ్‌. రెండుసార్లు, టిడిపి ఒకసారి గెలిచాయి. అయితే ఇండిపెండెంట్లుగా గెలిచిన వారంతా కూడా మజ్లిస్‌ వారే. 
 
నాంపల్లి  నియోజకవర్గం
                                                   విజేత                                    ప్రత్యర్థి
2023
2018                                    జాఫర్ హుస్సేన్ ( మజ్లిస్)             ఫిరోజ్ ఖాన్ ( కాంగ్రెస్) 
2014                                  జాఫర్ హుస్సేన్  ( ఎంఐఎం)            ఫిరోజ్ ఖాన్ ( టీడీపీ) 
 
 
సనత్‌నగర్‌ నియోజకవర్గం (హైదరాబాద్)

2023 లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన BRS అభ్యర్థి తలసాని శ్రీనివాసయాదవ్ విజయం సాధించారు. సమీప అభ్యర్థి కోట నీలిమపై తలసాని గెలిచారు.              2018 లో తలసాని శ్రీనివాస యాదవ్‌ గెలిచారు.  2014 ఎన్నికల వరకు ఆయన టిడిపిలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి KCR క్యాబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. 2018లో  టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసి మరోసారి గెలిచి మళ్లీ మంత్రి అయ్యారు. తలసాని తన సమీప తెలుగుదేశం ప్రత్యర్ది కూన వెంకటేష్‌ గౌడ్‌పై 30651 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 

 
సనత్‌నగర్‌ నియోజకవర్గం
                                                      విజేత                                ప్రత్యర్థి
2023                                    టి.శ్రీనివాసయాదవ్ (టీఆర్ఎస్    కోట నీలిమ (కాంగ్రెస్
2018                                    టి.శ్రీనివాసయాదవ్ (టీఆర్ఎస్)    కూన వెంకటేష్ గౌడ్ (టీడీపీ) 
2014                                    టి.శ్రీనివాసయాదవ్ ( టీడీపీ)         డి. విఠల్(టీఆర్ఎస్)
 
 
జూబ్లిహిల్స్‌ నియోజకవర్గం (హైదరాబాద్)
 
జూబ్లిహిల్స్‌ నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2018లో TRS  పక్షాన పోటీచేసి విజయం సాధించారు. 2014లో ఆయన టీడీపీ పక్షాన పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి పోయారు. 2018లో టిఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌ రెడ్డిపై 8385 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గోపీనాథ్ కు 42430 ఓట్లు రాగా, విష్ణువర్దన్‌ రెడ్డికి 34045 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ సుమారు 17 వేల ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. జూబ్లిహిల్స్‌ నియోజకవర్గంలో 2014లో  మాగంటి గోపినాధ్‌ తన సమీప ప్రత్యర్ధి, ఎమ్‌.ఐ.ఎమ్‌. నేత నవీన్‌ యాదవ్‌పై 9242 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంతకుముందు 2009లో గెలిచిన విష్ణువర్ధనరెడ్డి 2014లో  33642 ఓట్లు తెచ్చుకున మూడో స్థానానికి పరిమితం అయ్యారు. విష్ణు దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమారుడు. 2004లో ఖైరతాబాద్‌లో గెలుపొందిన జనార్ధనరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా, 2008లో జరిగిన ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో విష్ణు విజయం సాధించారు. 2009లో ఏర్పడిన  జూబ్లిహిల్స్‌ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి 2014లో ఓటమి చెందారు.  
 
జూబ్లిహిల్స్‌ నియోజకవర్గం
                                       విజేత                                   ప్రత్యర్థి
2023
2018                మాగంటి గోపీనాథ్ (టీఆర్ఎస్)            పి.విష్ణువర్థన్ రెడ్డి ( కాంగ్రెస్) 
2014                మాగంటి గోపీనాథ్ ( టీడీపీ)                 నీవన్ యాదవ్ (ఎమ్ ఐఎమ్)
 
 
ఖైరతాబాద్ నియోజకవర్గం (హైదరాబాద్)
 
2018లో ఖైరతాబాద్‌ శాసనసభ నియోజకవర్గంలో మాజీ మంత్రి దానం నాగేందర్‌ టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, 2014లో గెలిచిన  చింతల రామచంద్రారెడ్డిపై 28402 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. నాగేందర్‌ గతంలో మూడుసార్లు కాంగ్రెస్‌ ఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన కూడా గెలిచారు. 2009-2014 మధ్య కాంగ్రెస్‌ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌ఐ పక్షాన పోటీచేసి ఓటమి చెందిన తర్వాత కొంతకాలానికి ఆయన టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018లో టిక్కెట్‌ పొంది విజయం సాదించారు. ఇక్కడ మహాకూటమిలో కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన దాసోజు శ్రావణ్‌ సుమారు 33500 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు. నాగేందర్‌కు 63063 ఓట్లు రాగా, చింతల రామచంద్రారెడ్డికి 34666 ఓట్లు వచ్చాయి. నాగేందర్‌ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఖైరతాబాద్‌లో ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు, నాలుగుసార్లు బిసి (మున్నూరుకాపు)నేతలు గెలవగా  రెండుసార్లు వెలమ, ఒకసారి వైశ్య సామాజికవర్గం గెలిచాయి. నగరంలో ప్రాధాన్యత కలిగిన  ఖైరతాబాద్‌ నియోజకవర్గం 1967 నుంచి ఏర్పడింది. 
 
ఖైరతాబాద్ నియోజకవర్గం
                                              విజేత                                             ప్రత్యర్థి
2023                          
2018                         దానం నాగేందర్ (టీఆర్ఎస్)             చింతల రామచంద్రారెడ్డి ( బీజేపీ)
2014                         చింతల రామచంద్రారెడ్డి ( బీజేపీ)        దానం నాగేందర్ (టీఆర్ఎస్)
 
అంబర్ పేట నియోజకవర్గం (హైదరాబాద్)
 
2023 లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థి కాలేరు వెంకటేష్ ..సమీపం ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డిపై విజయం సాధించారు...
2018 లో అంబర్‌పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత జి.కిషన్‌ రెడ్డి పై పోటీ చేసిన TRS కొత్త అభ్యర్ది కాలేరు వెంకటేష్‌ విజయం సాధించారు. వరసగా మూడుసార్లు హిమయత్‌ నగర్‌, అంబర్‌పేటల నుంచి గెలిచిన  కిషన్‌ రెడ్డి 2018లో 1016 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వెంకటేష్‌కు 61558 ఓట్లు రాగా, కిషన్‌రెడ్డికి 60542 ఓట్లు వచ్చాయి. 
2014లో జి.కిషన్‌రెడ్డి  సమీప ప్రత్యర్ధి టిఆర్‌ఎస్‌ నేత ఎడ్ల సుధాకరరెడ్డిపై 62598 బారీ ఆధిక్యతతో విజయం సాధించారు. 2014లో ఇక్కడ పోటీచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు 16575 ఓట్లు మాత్రమే తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
 
అంబర్ పేట  నియోజకవర్గం
                                  విజేత                                                     ప్రత్యర్థి
2023             కాలేరు వెంకటేష్ (టీఆర్ఎస్)                          రోహిన్ రెడ్డి ( కాంగ్రెస్)
2018              కాలేరు వెంకటేష్ (టీఆర్ఎస్)                          జి.కిషన్ రెడ్డి ( బీజేపీ)
2014              జి.కిషన్ రెడ్డి ( బీజేపీ)                                       వై.సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్)
 
 
మలక్ పేట నియోజకవర్గం (హైదరాబాద్)
 
2018 లో మలక్‌పేట సిటింగ్‌ ఎమ్మెల్యే, మజ్లిస్‌ నేత అహ్మద్‌ బలాలా మూడోసారి గెలుపొందారు. ఆయన తన సమీప టీడీపీ ప్రత్యర్ది ముజఫర్‌ అలీపై 17572 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బలాలాకు 53281 ఓట్లు రాగా, ముజఫర్‌ అలీకి 29769 ఓట్లు వచ్చాయి. మహాకూటమిలో భాగంగా టీడీపీ ఇక్కడ పోటీచేసింది. ఇక్కడ బీజేపీ పక్షాన పోటీ చేసిన ఆలె జితేంద్రకు సుమారు 20900 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లో ఏడు స్థానాలలో మజ్లిస్‌ పట్టు నిలుపుకోగా, వాటిలో మలక్‌పేట ఒకటి. అహ్మద్‌ బలాలా ముస్లిం నేత. నియోజకవర్గాల పునర్విభజన తరువాత మలక్‌పేట నియోజకవర్గం పూర్తిగా ఎమ్‌.ఐ.ఎమ్‌కు అనుకూలంగా మారింది. దాంతో తొలిసారిగా 2009లో ఇక్కడ నుంచి మజ్లిస్‌ పక్షాన అహ్మద్‌బిన్‌ అబ్దుల్‌ బలాల వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. గతంలో మీర్‌ అహ్మద్‌ అలీఖాన్‌ రెండుసార్లు, జి.సరోజని పుల్లారెడ్డి రెండుసార్లు, ఎన్‌.ఇంద్రసేనారెడ్డి మూడుసార్లు, మల్‌రెడ్డి రంగారెడ్డి రెండుసార్లు గెలిచారు.
 
మలక్ పేట నియోజకవర్గం
                                      విజేత                            ప్రత్యర్థి
2023
2018                   అహ్మద్ బలాలా (మజ్లిస్)        ముజఫర్ అలీ (టీడీపీ)
2014                    అహ్మద్ బలాలా (ఎమ్.ఐ.ఎం)    వి.వెంకటరెడ్డి (బీజేపీ) 
 
 
ముషీరాబాద్‌ నియోజకవర్గం (హైదరాబాద్)
 
ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి 2018లో TRS అభ్యర్దిగా పోటీచేసిన ముఠా గోపాల్‌ ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది అనిల్‌కుమార్‌పై 36888 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే, 2019 వరకు బీజేపీ తెలంగాణ అద్యక్షుడుగా ఉన్న  డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ సుమారు 30800 ఓట్ల తేడాతో  మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తొలిసారి ఎన్నికైన ముఠా గోపాల్‌ గంగపుత్రుల సమాజికవర్గానికి చెందినవారు. గోపాల్‌కు 72919 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ ఐ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడైన అనిల్‌కుమార్‌కు 36031 ఓట్లు వచ్చాయి. డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ నుంచి 1999లో టిడిపితో కూటమి ఉన్నప్పుడు గెలవగా మళ్లీ 2014లో అదే కూటమి పక్షాన విజయం సాధించారు. 2014లో టిఆర్‌ఎస్‌ సమీప ప్రత్యర్ధి ముఠా గోపాల్‌పై 27386 ఓట్ల ఆధిక్యతతో లక్ష్మణ్‌ గెలిచారు. 2018లో గోపాల్‌ పైనే ఓడిపోయారు. 
 
ముషీరాబాద్‌ నియోజకవర్గం
                                     విజేత                              ప్రత్యర్థి
2023
2018     ముఠాగోపాల్ (బీఆర్ఎస్)              అనిల్ కుమార్(కాంగ్రెస్)
2014      డాక్టర్ కె.లక్ష్మణ్ (బీజేపీ)             ముఠాగోపాల్ (బీఆర్ఎస్) 
 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget