అన్వేషించండి

పార్టీల జెండాల తయారీలో సిరిసిల్ల నేతన్నలు ఫుల్ బిజీ

అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవడంతో పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బిజీ అయిపోయారు. ప్రచారంలో దూకుడు పెంచడానికి పార్టీ జెండాలు, కండువాలు, బ్యానర్ల కోసం సిరిసిల్లకు అన్ని పార్టీల నేతలు క్యూకట్టారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవడంతో పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బిజీ అయిపోయారు. ప్రచారంలో దూకుడు పెంచడానికి పార్టీ జెండాలు, కండువాలు, బ్యానర్ల కోసం సిరిసిల్లకు క్యూకట్టారు. ఒకేసారి ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో...నేతన్నలు తయారు చేసే జెండాలకు డిమాండ్‌ ఏర్పడింది. తెలంగాణ ఒక్కటే కాదు ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌ నుంచి చేనేతలకు ఫుల్ గా ఆర్డర్లు వస్తున్నాయి.

చేనేతలకు భారీ ఆర్డర్లు
మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు దయనీయంగా మారుతున్న పరిస్థితుల్లో మువ్వన్నెల జెండాలను తయారు చేసి ఉపాధి పొందుతున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా తమ వారసత్వ వృత్తిని కాపాడుకుంటున్న చేనేతలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో చేతి నిండి పని దొరికింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు రావడంతో చేనేతలు బిజీబిజీ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఉపయోగించే జెండాలు, కండువాలు, బ్యానర్ల తయారీలో నేతన్నలు, వారి కుటుంబసభ్యులు మునిగిపోయారు. చేతినిండా పనితో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీల ప్రచార సామాగ్రి కోసం సిరిసిల్లకే ఆర్డర్లు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పార్టీ నుంచి సిరిసిల్ల నేతన్నలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. 

సిరిసిల్లకు పార్టీల నేతల క్యూ
చేనేతలు, మహిళలకు పార్టీ జెండాలు, నేతలతో కూడిన జెండాల తయారీలో ఉపాధి లభిస్తోంది. సిరిసిల్లలోనే తయారైన పాలిస్టర్‌ బట్టను హైదరాబాద్‌లో ఆయా పార్టీల గుర్తులతో జెండాలు, బ్యానర్లు, కండువాలు ప్రింటింగ్‌ చేసి, సిరిసిల్లలో కటింగ్‌, కుట్టు పనులు చేస్తున్నారు. జెండాలు కుట్టడం ద్వారానే మహిళలు నెలకు రూ.4 వేల నుంచి రూ.5వేల దాకా సంపాదిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే జెండాలు వివిధ సైజుల్లో లభిస్తాయి. కండువాల ధరలు రూ.5 ఉంచి రూ.50 దాకా, చిన్న జెండాలు రూ.10, పెద్ద బ్యానర్లు రూ.80లకు తయారు చేస్తున్నారు. డిజిటల్‌ బ్యానర్లలో పెద్దవి రూ. 250లకు తయారు చేస్తున్నారు. తెలంగాణలోని కీలక పార్టీల నేతలందరూ సిరిసిల్లకు క్యూకడుతున్నారు. పార్టీల జెండాలు, కండువాలు, బ్యానర్లు ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. 

వస్త్ర పరిశ్రమ కళకళ
వచ్చే నాలుగైదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిసా, అరుణాచల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల పార్టీలకు సంబంధించిన ఆర్డర్లూ వస్తున్నాయి. ఈ రకంగా టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన తదితర పార్టీల ప్రచార సామగ్రి ఇప్పుడు అక్కడే తయారవుతోంది. ఒకే గూడు కింద తయారైన ప్రచార సామగ్రి రెడీ అవుతోంది. సిరిసిల్లలో 35 ఏళ్లుగా కాటన్‌, పాలిస్టర్‌ వస్త్రాలపై పార్టీల నినాదాలతో పాటు, ప్రచారపు జెండాలు, బ్యానర్లు తయారు చేస్తున్నారు. ఇక్కడ త్రివర్ణ పతాకాలు కూడా తయారవుతాయి. సిరిసిల్లలో తయారయ్యే జెండాలు, బ్యానర్లు తమిళనాడు, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. జెండాలు, బ్యానర్ల తయారీతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కళకళలాడుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget