అన్వేషించండి

TDP Manifesto 2024: ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల- ఇవే టాప్ హైలైట్స్‌

AP Election 2024: పోలింగ్ కొన్ని రోజుల్లో జరగనుంది. ఇప్పటికే ఎవరి స్టైల్‌లో వాళ్లు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేలా మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు.

TDP BJP And Janasena Manifesto 2024: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను ప్రకటించింది. ఇప్పుడు వాటికి మరిన్ని జోడించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 

మహా కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలోని హైలైట్స్ ఇవే 

  • ఇంటింటికీ రక్షిత మంచినీరు 
  • రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌ సెన్సస్‌(ఎవరికి ఎలాంటి స్కిల్స్‌ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి స్కిల్స్‌ అవసరం. ఎలాంటి స్కిల్స్ నేరుచ్కుంటే ఉద్యోగాలు వస్తాయనేది చెప్పడానికి )
  • చిన్నతరహా, అంకుర సంస్థలకుప్రాజెక్టు వ్యవయంలో పది లక్షల సబ్సిడీ
  • పది శాతం ఈడబ్ల్యూఎస్‌ అమలు 
  • అమరావతి నిర్మాణం ప్రారంభం 

యువత కోసం  మేనిఫెస్టో 

  • మెగా డీఎస్సీ
  • ప్రతి ఏటా జాబ్ కేలండర్ 
  • పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు 
  • క్రీడలను ప్రోత్సహిస్తాం 
  • డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు

బీసీ డిక్లరేషన్ 

  • 50 ఏళ్లకే నెలకు నాలుగవేల రూపాయలు పింఛన్లు
  • బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
  • బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షా 50 వేలు కోట్లు ఖర్చు 
  • స్థానిక సంస్థల నామినేటెడ్‌ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్ అమలు 
  • చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ రావడానికి కృషి చేస్తాం 
  • బీసీ కులాల దామాషా ప్రకారం కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇస్తాం 
  • స్వయం ఉపాధి కోసం ప్రతి ఏటా పదివేల కోట్లు ఖర్చు పెడతాం 
  • ఆదరణ కింద ఐదు వేల కోట్లు ఖర్చు- ఆధునిక పనిముట్లు అప్పగింత 
  • వారసత్వ వృత్తిపై ఆధార పడే వాళ్లకు ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఆధునీకరణలో వారిని ఇన్వాల్వ్‌ చేస్తాం 
  • చేనేత పరిశ్రమకు ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు పవర్‌ లూమ్స్‌కు ఐదు వందల యూనిట్లు, హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇబ్బందుల్లో ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి 24000 రూపాయలు ఆర్థిక సాయం 
  • దేవాలయాల్లో పని చేస్తున్న నాయినబ్రాహ్మణులకు  గౌరవేతనంగా 25000, షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం 
  • గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు
  • వడ్డెర్లకు క్వారీల్లో 15 రిజర్వేషన్ ఇస్తాం. రాయల్టీ, సీన్రీ ఛార్జీల్లో మినహాయింపు 
  • రజక, దోబీ ఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు, దోబీ ఘాట్ల కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌
  • మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20 వేల ఆర్థిక సాయం చేస్తాం. 217 జీవో రద్దు, కొత్త బోట్లు, ఉన్న బోట్ల మరమ్మతులు చేపించడం 
  • స్వర్ణకారుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ 
  • అతి దారుణంగా చనిపోయిన కేసులు రీ ఓపెన్ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. 
  • డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీలేని రుణాలు 
  • ఉద్యోగాలు చేసే మహిళల కోసం హాస్టల్స్‌
  • చదువు ఆపేసిన మహిళలకు "కలలకు రెక్కలు" పేరుతో వడ్డీలేని రుణాలు 
  • ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వచ్చేలోపు ఇంటీరియం రిలీఫ్‌
  • ప్రభుత్వ ఉద్యోగులకు  ప్రతి నెల జీతాలు ఇచ్చేలా వ్యవస్థలు సరిదిద్దుతాం
  • సీపీఎస్‌పై సమీక్ష చేసి సమస్య పరిష్కారం
  • వంలటీర్లకు పదివేల గౌరవేతనం
  • కాపు సంక్షేమ కోసం 15వేల కోట్లు ఖర్చు
  • కాపు యువతకు, మహిళలు స్వయం ఉపాధి కోసం ప్రయత్నాలు
  • అగ్రవర్ణాల్లో ఉన్న పేదల ఉన్నతి కోసం ప్రయత్నాలు
  • ఏప్రిల్ నుంచి వృద్ధులకు 4000 పింఛన్లు
  • దివ్యాంగులకు ఆరువేలు
  • చూపు పూర్తిగా లేని వారికి 15 వేల రూపాయల పింఛన్
  • కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు 10వేల పింఛన్
  • భూమిలేని పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు నిర్మాణం

ముస్లింలకు వరాలు 

  • 50 ఏళ్లకి పింఛన్
  • ఈద్గాలు, ఖబరిస్తాన్‌ల కోసం స్థలాలు 
  • విజయవాడ సమీపంలో హజ్ హౌస్ 
  • నూర్‌ బాషా కార్పొరేషన్‌కు ఏటా 100 కోట్లు 
  • మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీలేని రుణాలు 
  • ఇమామ్‌లకు పదివేలు, మౌజామ్‌లకు ఐదు వేలు గౌరవేతనం 
  • అర్హత ఉన్న ఇమామ్‌లకు ప్రభుత్వ ఖాజీలుగా నియామకం 
  • మసీదుల నిర్వహణకు నెల ఐదువేల ఆర్థిక సాయం 
  • హజ్‌ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు లక్ష రూపాయల ఆర్థిక సాయం 
  • ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా 

ఏంటీ సూపర్ 6
గతేడాది మహానాడు వేదికగా టీడీపీ అధినేత సూపర్ 6 పేరుతో ఆరు పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్‌లు, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, 3000 వేల నిరుద్యోగ భృతి, స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల తల్లలకు 15000 నగదు, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. వీటితోపాటు మేగా డీఎస్సీ ఇతర హామీలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటికీ ఇప్పుడు ప్రకటించిన హామీలు అదనం. 


వివిధ సభల్లో ఇచ్చిన హామీలు 

వివిధ సభల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పలు హామీలు ఇచ్చారు. వాటిని ఓసారి పరిశీలిస్తే... ఎన్నికైన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతామన్నారు. వృద్ధాప్య పెన్షన్ 4000కు పెంచుతామన్నారు. దివ్యాంగుల పెన్షన్ 6000 ఇస్తామన్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000 చొప్పున ఇస్తామన్నారు. ఉచిత ఇసుక ఇవ్వడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, భూ హక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్, బీసీ రక్షణ చట్టం, చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ, పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం, పెళ్లి కానుక 1,00,000 ఇస్తామని హామీ ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget