ఏపీ ఎన్నికలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది

మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్‌లు, స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల తల్లలకు 15000 నగదు
3000 వేల నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం

మెగా డీఎస్సీ, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్. ఉద్యోగాల కోసం ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ల ఏర్పాటు

50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్లు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షా 50 వేలు కోట్లు ఖర్చు

మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్థిక సాయం, జీవో 217 రద్దు చేయడం

కాపు సంక్షేమ కోసం 15వేల కోట్లు ఖర్చు, కాపు యువతకు, మహిళలు స్వయం ఉపాధి కోసం ప్రయత్నాలు

ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు, సబ్ ప్లాన్ నిధులు వారి కోసమే ఖర్చు, ఎస్టీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం

పోలరం ప్రాజెక్టు పూర్తి చేయడం, గాలేరు నగరి, హంద్రీనీవా ఇతర రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం

ఉచిత ఇసుక విధానం అమలు చేయడం, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించడం

పర్యాటక రంగం అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా మౌళిక వసతులు కల్పించడం

ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై ఫోకస్, అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు ఉచిత నివాస స్థలం