అన్వేషించండి

Tamil Nadu Assembly Election Results: విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?

Tamil Nadu Assembly Election Results : విజయ్‌కు పూర్తి మెజార్టీ రావడం కష్టంగా కనిపిస్తోంది. కొంత మంది మిత్రులు ఖచ్చితంగా అవసరం అవుతారు. ఎవరు కలసి వస్తారు?

Vijay wave but the magic mark is difficult: తమిళనాడు రాజకీయాల్లో శతాబ్ద కాలపు ద్రవిడ ఆధిపత్యానికి తెరదించుతూ, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం  సరికొత్త శక్తిగా ఉద్భవించింది. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు 10 నుంచి 15 స్థానాల దూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. ఈ అనిశ్చితి తమిళనాట ఒక సంక్లిష్టమైన హంగ్ అసెంబ్లీ పరిస్థితులకు దారితీస్తోంది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు డీఎంకే కూటమిలోని చిన్న పార్టీలపైనే ఉన్నాయి.                                

 డీఎంకే మిత్రపక్షాలైన  కాంగ్రెస్, పీఎంకే  , సీపీఐ, సీపీఎం  పార్టీల నిర్ణయమే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును శాసించనుంది. డీఎంకే కూటమి మూడో స్థానానికి పడిపోవడంతో, ఆ కూటమిలో ఉండి గెలుపొందిన 10-15 మంది అభ్యర్థులు ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారారు. ఒకవేళ ఈ పార్టీలు స్టాలిన్ నాయకత్వాన్ని వీడి, విజయ్ వైపు మొగ్గు చూపితే తమిళనాడులో సరికొత్త ప్రభుత్వం ఏర్పడటం సులువవుతుంది. అయితే, దశాబ్దాలుగా డీఎంకేతో ఉన్న బంధాన్ని తెంచుకుని కొత్త పార్టీకి మద్దతు ఇవ్వడంపై ఈ పార్టీల్లో అంతర్గత మథనం మొదలైంది.

మరోవైపు, ద్రవిడ దిగ్గజాలైన  డీఎంకే, ఏఐఏడీఎంకే లు మాత్రం విజయ్‌తో చేతులు కలిపేందుకు ససేమిరా అంటున్నాయి. విజయ్ తన రాజకీయ సిద్ధాంతాన్ని ద్రవిడ ,  జాతీయవాద కలయిక గా ప్రకటించి, ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకుకే ఎసరు పెట్టారు. ఇప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చి అధికారాన్ని అప్పగిస్తే, భవిష్యత్తులో తమ ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్న భయం ఆ రెండు పార్టీల అగ్రనేతలను వెంటాడుతోంది. అందుకే, అధికారం కంటే తమ సిద్ధాంతాన్ని, ఉనికిని కాపాడుకోవడమే ముఖ్యమని వారు భావిస్తున్నారు.

ఈ పరిణామాలతో  చిన్న పార్టీలు , స్వతంత్ర అభ్యర్థులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. తాజా సమాచారం ప్రకారం, గెలిచిన అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు తెరవెనుక రిసార్ట్ రాజకీయాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ నిర్ణయం కూడా అత్యంత కీలకంగా మారనుంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ ముందుకు రాకపోతే లేదా బలనిరూపణలో విఫలమైతే, రాష్ట్రంలో కొంతకాలం పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.                    

 తమిళనాడు రాజకీయాలు ఒక సంధి కాలంలో ఉన్నాయి. విజయ్ కి  హవా  ఉన్నా మెజారిటీ  లేకపోవడం, పాత పార్టీలకు బలం ఉన్నా ప్రజాధరణ తగ్గడం తమిళనాడులో  ఒక అనిశ్చిత రాజకీయ శకానికి నాంది పలికింది. డీఎంకే మిత్రపక్షాలు విజయ్ మిత్రపక్షాలుగా మారతాయా? లేక తమిళనాడు మరోసారి మధ్యంతర ఎన్నికల వైపు వెళ్తుందా? అన్నది మరో 24 గంటల్లో తేలిపోనుంది. దశాబ్దాలుగా సాగుతున్న రెండు పార్టీల రాజకీయం ముగిసి, భిన్నపార్టీల రాజకీయం మొదలవ్వడం తమిళనాడు చరిత్రలో ఒక పెద్ద మలుపు.       

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget