Punjab Election 2022: సోనూసూద్ కారు సీజ్- ఇంటి నుంచి బయటకు రావద్దని ఈసీ వార్నింగ్
సోనూసూద్ కారును అధికారులు సీజ్ చేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు సోనూసూద్ ప్రయత్నించినందుకే ఇలా చేసినట్లు అధికారులు తెలిపారు.
యాక్టర్ సోనూసూద్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతుండగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సోనూసూద్‌ను అధికారులు అడ్డుకున్నారు. కారును సీజ్ చేసి ఆయన్ను తిరిగి ఇంటికి పంపించారు. ఇంటి నుంచి బయటకు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏం జరిగింది?
సోనూసూద్ సోదరి మాల్విక సూద్ మోగా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈరోజు పోలింగ్ జరుగుతోన్న సమయంలో నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సోనూసూద్ ప్రయత్నించినట్లు జిల్లా పీఆర్ఓ తెలిపారు.
రియాక్షన్
Sonu Sood was trying to enter a polling booth. During this, his car was confiscated and he was sent home. Action will be taken against him if he steps out of his house: Moga District PRO Pradbhdeep Singh
— ANI (@ANI) February 20, 2022
His sister Malvika Sood is contesting from Moga as a Congress candidate. pic.twitter.com/Ueeb7CNy8t
ఈ వార్తలపై సోనూసూద్ స్పందించారు. ఎన్నికల పోలింగ్ కేంద్రంలో అకాలీ దళ్‌కు చెందిన వారు ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిసి వెళ్లినట్లు పేర్కొన్నారు.
Also Read: Covid Update: దేశంలో 20 వేలకు దిగువనే కరోనా కేసులు- 673 మంది మృతి
Also Read: SSC CHSL 2022 Exam: ఇంటర్ పాసయ్యారా? గుడ్‌న్యూస్- 5 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్