YS Sharmila Assests : జగన్‌కు రూ. 82 కోట్ల బాకీ ఉన్న షర్మిల - ఆస్తులెన్ని అంటే ?
AP Elections 2024 : నామినేషన్ ఎన్నికల అఫిడవిట్‌లో షర్మిల తన ఆస్తులను ప్రకటించారు. మొత్తం ఆస్తులు రూ. 182 కోట్లుగా ప్రకటించగా.. ఒక్క జగన్‌కే తాను రూ. 82 కోట్లకుపైగా అప్పు ఉన్నట్లుగా తెలిపారు.
![YS Sharmila Assests : జగన్‌కు రూ. 82 కోట్ల బాకీ ఉన్న షర్మిల - ఆస్తులెన్ని అంటే ? Sharmila declared her assets in nomination election affidavit YS Sharmila Assests : జగన్‌కు రూ. 82 కోట్ల బాకీ ఉన్న షర్మిల - ఆస్తులెన్ని అంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/20/71b896bb14d15f05a87f9d68b902fad61713607064761228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sharmila declared her assets in nomination election affidavit : వైఎస్ షర్మిలా రెడ్డి తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ పోరాటం చేస్తున్నారు. అయితే సోదరికి జగన్ మోహన్ రెడ్డి రూ. 82 కోట్లకుపైగా అప్పు ఇచ్చారు. ఈ విషయాన్ని షర్మిల తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకిటంచారు. షర్మిల ఆస్తుల్లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. ఆమె ఆస్తులు ప్రకటించలేదు. తొలి సారి ఆస్తుల్ని వెల్లడించారు.
షర్మిల మొత్తం ఆస్తూలు రూ. 182.82 కోట్లు ఉంటాయని అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో అప్పుల వివరాలు కూడా ఉన్నాయి. రూ. 82,58,15,000 అప్పును సోదరుడు జగన్ మోహన్ రెడ్డి వద్ద తీుకున్నారు. అంతే కాదు తన వదిన వైఎస్ భారతీరెడ్డి వద్ద కూడ షర్మిల అప్పు చేశారు. ఆమె వద్ద రూ. 19,56,682 అప్పులు చేశారు. వీటిని తిరిగి చెల్లించాల్సి ఉంది. షర్మిలకు ఏడాదికి ఆదాయం రూ. 97,14,213 వస్తుందని అఫిడవిట్‌లో తెలిపారు. షర్మిల భర్త అనిల్ కుమార్ ఆదాయం రూ. 3,00,261 మాత్రమేనని తెలిపారు.
షర్మిల వెల్లడించిన ఆస్తుల్లో చరాస్తులు రూ. 123,26,65,163 గా తేల్చారు. 45,19,72,529 రూపాయల విలువైన చరాస్తులు ఆమె భర్త అనిల్ కుమార్ కలిగి ఉన్నారు. ఇక స్థిరాస్తులు తక్కువగా ఉన్నాయి. షర్మిలకు 9 కోట్ల 29 లక్షల 58 వేల 180 రూపాయల స్థిరాస్తులు మాత్రమే ఉన్నాయి. భర్త అనిల్ కుమార్‌కు ఇంకా తక్కువగా 4,05,92,365 విలువైన స్థిరాస్తులు మాత్రమే ఉన్నాయి.
జగన్, భారతి రెడ్డిలకు చెల్లించాల్సిన అప్పు తప్ప ఇంకేమీ లేదు. వారిద్దరికీ ఇవ్వాల్సిన మొత్తం 82 కోట్ల 77 లక్షల 71,682 రూపాయలుగా ఉంది. అనిల్ కుమార్ అప్పులు రూ. 35,81,19,299 గా తే్చారు. షర్మిల వద్ద 3 కోట్ల 69 లక్షల 36వేల విలువైన బంగారం ఉంది. అలాగే 4 కోట్ల 61 లక్షల 90 వేల 688 రూపాయల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. అనిల్ కుమార్‌కు 81 లక్షల 60వేల విలువైన బంగారం.. 42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి.
షర్మిలపై మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి. ఇందులో ఎన్నికల కోడ్ ఉల్లంగన కేసులు కూడా ఉన్నాయి. షర్మిల ఉస్మానియా యూనివర్శఇటీ పరిధిలోని సెయింట్ అన్నా కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజీ నుంచి బీకారం పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
ఇక కడప స్థానానికి వైసీపీ తరపున నామినేషన్ వేసిన వైఎస్ అవినాష్ రెడ్డి తనకు రూ. 40 కోట్లు ఆస్తుల ఉన్నట్లుగా తెలిపారు. ఆయనకు ఐదేళ్ల కింద ఉన్న ఆస్తులు రూ. 19 కోట్లు మాత్రమే. ఐదేళ్లలో 116 శాతం పెరిగాయి.
వైఎస్ జగన్ తో షర్మిల విభేధించి సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు. వారి మధ్య ఆస్తుల వివాదం ఉన్నదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే బహిరంగంగా ఇంత వరకూ ఎలాంటి ప్రకటనలు షర్మిల చేయలేదు. ాకనీ రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యపైనా.. నిందితుల్ని జగన్ రక్షిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)