అన్వేషించండి
Advertisement
Punjab Elections 2022: 'కరోనాను తరిమికొట్టకుండా డప్పు కొట్టారు- ఇదేం ఐడియా మోదీజీ'
అసత్య హామీలు కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీ మాటలు వినాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పటియాలా జిల్లా రాజ్‌పురాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ చేసేవన్నీ అసత్య వాగ్దానాలేనన్నారు.
#PunjabElections2022 | I will not make false promises. If you (public) want to hear false promises being made, listen to Modi Ji, Badal Ji and Kejriwal Ji. I have been taught to say only the truth: Congress leader Rahul Gandhi addressing a public meeting at Rajpura, Patiala dist pic.twitter.com/GgV18KPdkY
— ANI (@ANI) February 15, 2022
" నేను అసత్య హామీలు ఇవ్వను. మీరు అబద్ధపు హామీలు వినాలనుకుంటే మోదీ, బాదల్, కేజ్రీవాల్ మాటలు వినండి. నిజం చెప్పడమే నాకు నేర్పించారు. 2014 ఎన్నికలకు ముందు దేశంలో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది 2 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు, అవినీతి గురించి మోదీ మాట్లాడట్లేదు. ఇప్పుడు కేవలం డ్రగ్స్ గురించే భాజపా మాట్లాడుతోంది. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
నేనేం చెప్పినా వినరు
" పంజాబ్ యువత డ్రగ్స్ నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటుందని 2013లో ఇక్కడికి వచ్చి చెప్పాను. ఆ సమయంలో భాజపా, అకాలీదళ్ నన్ను విమర్శించాయి. అసలు పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యే లేదని వాదించాయి. అలానే కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని గతంలో హెచ్చరించాను. కానీ మోదీ మాత్రం డప్పులు కొట్టండి, మొబైల్ టార్చ్‌లు వేయండి అన్నారు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ప్రపంచం
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion