అన్వేషించండి

Assam Exit Polls 2026: అస్సాం బీజేపీదే! క్లీన్‌ స్వీప్ ఖాయమంటున్న ఎగ్జిట్  పోల్స్‌!

Assam Exit Polls 2026: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్‌ చెబుతున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరుగులేని విజయం సాధించనుంది.
  • ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఎన్డీఏ 85-100 సీట్లు గెలుచుకుంటుంది.
  • నియోజకవర్గాల పునర్విభజన, అభివృద్ధి, హిమంత బిశ్వ శర్మ వ్యూహాలు కీలకం.
  • కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం, సీట్ల పరంగా భారీ ఎదురుదెబ్బ.

Assam Exit Polls 2026: అస్సాం రాజకీయాల్లో మరోసారి హిమంత్ బిశ్వ శర్మ మార్క్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 9న ముగిసిన 126 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతోందని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అభివృద్ధి, హిందుత్వ అజెండా, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు ఓటర్ల తీర్పును ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. 

అస్సాంలోని మొత్తం 126 స్థానాలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 64. ప్రముఖ సర్వే సంస్తళు వెల్లడించిన అంచనాల ప్రకారం...

మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనాలు 

ఈ సంస్థ అంచనాల ప్రకారం బీజేపీ కూటమి 85 నుంచి 95 స్థానాలు గెలుచుకనే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేవలం 25-32 స్థానాలకే పరిమితం కానుంది. ఇతరులు, ఏఐయూడీఎఫ్‌ ఆరు నుంచి 12 స్థానాలు సాధించవచ్చు. 

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా అంచనాలు 

ఈ సర్వే ఎన్డీయేకు మరింత భారీ మెజారిటీని కట్టబెట్టింది. బీజేపీ కూటమి 88 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 24-36 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. 

ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఎన్డీఏ సుమారు 45 శాతం ఓట్ల నుంచి 48 శాతం ఓట్లను సాధించవచ్చు. కాంగ్రెస్ కూటమి 38 నుంచి 40 శాతం ఓట్లు పొందవచ్చని లెక్కలు చెబుతున్నాయి. 

ప్రాంతాల వారీగా ఓటర్ల నాడి

అస్సాం భౌగోళికంగా, సామాజికంగా భిన్నమైన ప్రాంతాలను కలిగిఉంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అన్ని ప్రాంతాల్లోనూ తన పట్టును చాటుకోబోతోందని చెబుతున్నారు. అప్పర్ అస్సాంలో బీజేపీ కూటమి 21-22 స్థానాలను గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ మూడు నుంచి ఐదు స్థానాలకు పరిమితం కావచ్చని అంటున్నారు. ఇక్కడ అహోం సామాజిక వర్గాల ఓట్లు చాలా కీలకం. లోయర్ అస్సాంలో బీజేపీ కూటమి 19-21 స్థానాలతో ఆధిపత్యం ప్రదర్శించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాంగ్రెస్ 9-11 స్థానాలు సాధించవచ్చు. బరాక్ వ్యాలీలో బెంగాలీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా బీజేపీ కూటమి 9-10 మధ్య స్థానాలు కాంగ్రెస్ 3-4 స్థానాలు గెలుచుకోవచ్చు. బోడోలాండ్‌ ప్రాంతీయ జిల్లాల్లో బీజేపీ కూటమి 12-13 స్థానాలతో క్లీన్ స్వీప్ చేయవచ్చు. అక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవడం లేదని అంచనాలు చెబుతున్నాయి. 

బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు 

2023లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్‌. దీని వల్ల మైనారిటీలు ఎక్కువగా ఉన్న స్థానాలు 35 నుంచి 23కు తగ్గాయి. ఇది స్వదేశీ, గిరిజన జనాభా ప్రభావం ఉన్న చోట్ బీజేపీకి భారీగా కలిసి వచ్చింది. 

Also Read: కేరళలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పేది ఒక్కటే - లెఫ్ట్ పార్టీలకు ఎగ్జిట్ - కాంగ్రెస్ కూటమికి పీఠం !

ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తన దూకుడు రాజకీయాలతో ప్రజల్లో బలమైన ముద్రవేశారు. చొరబాటుదారుల అంశం, అభివృద్ధి పథకాలు ఆయనకు అనుకూలంగా మారాయి. తన సొంత నియోజకవర్గంలో 80 శాతం ఓట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బీజేపీలోకి వలస వెళ్లడం ఆ పార్టీని దెబ్బ తీసింది. మాజీ అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా, ఎంపీ ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌ వంటి వారు ఎన్నికలకు ముందు పార్టీని వీడటం కాంగ్రెస్‌ను సంస్థాగత బలాన్ని తగ్గించింది. అలాగే ఏఐయూడీఎఫ్‌తో పొత్తు లేకపోవడం కూడా కాంగ్రెస్ ఓట్ల చీలికకు దారి తీసింది. 

అస్సాం రాజకీయ చరిత్రలో వరుసగా మూడోసారి ఒకే కూటమి అధికారంలోకి రావడం అనేది అరుదైన విషయం. గతంలో కాంగ్రెస్ హయాంలో తరుణ్‌ గొగోయ్‌ అటువంటి ఘనత సాధించారు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ అదే బాటలో పయనిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో హిమంత భార్య రినికి భూయాన్ శర్మ ఆస్తుల వివాదం, పాస్‌పోర్ట్ అంశంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. కానీ అవి ఓటర్ల తీర్పును మార్చినట్టు ఎగ్జిట్ పోల్స్ సూచించడం లేదు.  

Also Read: తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ గందరగోళం - డీఎంకే, అన్నాడీఎంకేకే కాదు విజయ్ పార్టీకీ చాన్స్ !

Frequently Asked Questions

అస్సాం ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి?

అస్సాం ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని మ్యాట్రిజ్, ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా వంటి ప్రముఖ సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని అంచనాలు చెబుతున్నాయి?

మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏ 85-95 సీట్లు, ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకారం 88-100 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

కాంగ్రెస్ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చని అంచనా?

కాంగ్రెస్ కూటమి కేవలం 25-32 సీట్లకు పరిమితం అవుతుందని మ్యాట్రిజ్ అంచనా వేయగా, ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా 24-36 సీట్లు రావచ్చని పేర్కొంది.

ఓట్ల శాతం పరంగా ఏ కూటమి ముందంజలో ఉంది?

ఓట్ల శాతం ప్రకారం చూస్తే బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఎన్డీఏ సుమారు 45-48 శాతం, కాంగ్రెస్ కూటమి 38-40 శాతం ఓట్లు పొందవచ్చని లెక్కలు చెబుతున్నాయి.

అస్సాం ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చిన అంశాలు ఏమిటి?

2023లో నియోజకవర్గాల పునర్విభజన, ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ దూకుడు రాజకీయాలు, చొరబాటుదారుల అంశం, అభివృద్ధి పథకాలు బీజేపీకి కలిసి వచ్చాయి.

టాప్ హెడ్ లైన్స్

Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget