అన్వేషించండి

Dharmavaram Assembly Constituency: నేటి నుంచి ధర్మవరంలో సత్యకుమార్ ప్రచారం- రాక్షస కబంధహస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకుందామని నినాదం

Andhra Pradesh Elections 2024: ధర్మవరంలో నేటి నుంచి ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ ప్రచారం ప్రారంభించనున్నారు. నిన్న అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.

Anantapur News: నేటి నుంచి ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ (Satya Kumar) ప్రచారం చేయనున్నారు. బుధవారం అనంతపురం జిల్లాకు చేరుకున్న ఆయనకు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయన్ని స్వాగతం పలికిన వారిలో టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ (Parital Sriram), మాజీ మంత్రి పరిటాల సునీత కూడా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ నివాసంలోనే కూటమి నేతల సమన్వయ సమావేశం జరిగింది. 

శాంతి, అహింస కోరుకునే ధర్మవరాన్ని ఒక అధర్మవరంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) మార్చేశారని సత్యకుమార్ ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలోని పరిటాల శ్రీరామ్ స్వగృహంలో ఆయన బిజెపి, టిడిపి నేతలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని పలు అంశాల గురించి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను బిజెపి జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు పని చేశానని చెప్పారు. అలాగే వివిధ శాఖల ఓఎస్డిగా ఎంతో పాలన అనుభవం కూడా ఉందని అన్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ధర్మవరం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉందని చెప్పారు. పరిటాల శ్రీరామ్ ఇతర నాయకుల సహకారంతో ఇక్కడ కచ్చితంగా విజయం సాధిస్తానన్నారు. 

గడిచిన ఐదేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మట్టి దోపిడీ చేస్తుంటే.. ఇక్కడ మాత్రం పంచభూతాలను కూడా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చెరువుని కబ్జా చేసి ఒక విలాసవంతమైన ఇల్లు నిర్మించుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని సత్యకుమార్ విమర్శలు చేశారు. ప్రతిదానికి ఒక ప్యాకేజీ నిర్ణయించి.. ఇక్కడ ప్రజలను పట్టిపీడిస్తున్న పాలకులను పారద్రోలుదామని ఆయన పిలుపునిచ్చారు. ధర్మవరాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది ఒక దృక్పథంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. 

పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో తొలిసారి ఒక బీసీ అభ్యర్థి పోటీ చేయబోతున్నారని ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ అన్ని అంశాల గురించి ఆయన తెలుసుకున్నారు అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అభివృద్ధి ఎలా చేయాలన్నది ఒకపక్కా ప్రణాళికతో ఆయన ఉన్నారని అన్నారు. ఒక జాతీయ నాయకుడు ధర్మవరానికి రావడం సంతోషంగా ఉందని.. సత్య కుమార్ ద్వారా ధర్మవరంలో అనేక సమస్యలు పరిష్కరించుకునే వీలు ఉందని అన్నారు. ధర్మవరానికి సత్య కుమార్ తొలిసారి వస్తున్నారని ఈ పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget