Nalgonda Election Results 2024: నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి సునామీ, కనీసం దరిదాపుల్లో లేని బీజేపీ, బీఆర్ఎస్
Nalgonda Lok Sabha Election Results 2024: నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో ఉంది.
Nalgonda Lok Sabha Elections 2024: నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 559905 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. రఘువీర్ రెడ్డికి 784337 ఓట్లు పోలయ్యాయి. సైదిరెడ్డికి 224432 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కంచర్ల క్రిష్ణా రెడ్డికి 218417 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు విపరీతంగా ఉంది. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రభావం లేదు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘురవీర్ రెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగారు. ఈయనకు ఉదయం 11 గంటల సమయానికి 738400 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 525362 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల క్రిష్ణా రెడ్డి 534796 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు మూడో స్థానంలోనే ఉంది.