CM Revanth Reddy : ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో పోల్చుకుని
Loksabha Elections 2024 : కాంగ్రెస్‌ను టచ్ చేస్తే ఉరికించి కొడతామని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మెదక్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Revanth Reddy Medak Tour : " కరెంట్ వైర్ కూడా నా లాగా సన్నగా ఉంటది , దాన్నిటచ్ చేస్తే షాకే సాలిడ్ గా ఉంటుంది " అంటూ ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగుల్ని రేవంత్ రెడ్డి.. రాజకీయ ప్రసంగాల్లో తనకు అన్వయించుకుని ..కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామనేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని తర్వాత జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.
ంకాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు.. అదేమైనా నువు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు.. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త’ అంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కారు పని అయిపోయిందని కార్ఖానాకు పోయిందని.. ఇక బయటకు రాదన్నారు. ల వచ్చే పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పని అయిపోయిందని అన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు గుర్తుచేశారు. 1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆరెఎస్ చేతిలోనే ఉందన్నారు. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప.. బీజేపీ, బీఆరెఎస్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదని విమర్శించారు. పదేళ్ల బీఆరెఎస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానన్న రఘునందన్ రావును అడుగుతున్నా.. మేమంతా బస్సులేసుకుని దుబ్బాక వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేంటో.. చేసిన అభివృద్ధి ఏంటో చూపించు. పదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్నారు. కేసీఆర్ సీఎం గా ఉన్నారు. ఈ పదేళ్లలో వీళ్లు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లిడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించే ప్రజా పాలన కాంగ్రెస్ సొంతం అని తెలిపారు. రూ.22,500 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నాం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం అని అన్నారు. తాము ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తుంటే.. కడుపు మండిన మోదీ, కేసీఆర్ కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలను అందించే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ రైతుల భూములు గుంజుకున్న దుర్మార్గుడు బీఆరెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ఫైర్ అయ్యారు.