Madakasira Election Result 2024: 25 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచిన మడకశిర ఎమ్మెల్యే
Madakasira Assembly Constituency: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మడక శిర నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఇక్కడ తెదేపా అభ్యర్థి ఎంఎస్ రాజు తన సమీప వైకాపా అభ్యర్థి ఇరలక్కప్పపై 25 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలిచారు.
Madakasira Assembly Election Result 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మడక శిర నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఇక్కడ తెదేపా అభ్యర్థి ఎంఎస్ రాజు తన సమీప వైకాపా అభ్యర్థి ఇరలక్కప్పపై 25 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలిచారు.
రెండు అతి పెద్ద పార్టీల మధ్య హోరా హోరీ పోరు. పోనీ ఓట్లేమన్నా పది ఇరవై వేల లోపు ఉన్నాయా అంటే అదీ కాదు. లక్షా యాభైవేలకు పైగా పోలైన ఓట్లలో చివరికి అభ్యర్థి గెలిచిన తేడా ఎంతో తెలుసా కేవలం 25 ఓట్లు.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అద్భుతం చోటు చేసుకుంది. హోరా హోరీగా జరిగిన పోటీలో విజయం తెదేపా, వైకాపా అభ్యర్థులతో దోబూచులాడింది. అభ్యర్థులు చివరి రౌండు వరకు విజయం తమదేననే ధీమాతో కొనసాగారు. కాగా 18 రౌండ్ల పాటు జరిగిన కౌంటింగ్ లో చివరికి తెదేపా అభ్యర్థి తన సమీప అభ్యర్థి ఇరలక్కప్పపై 25 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు.
మొత్తం లక్షా యాభైవేల ఓట్లకు పైగా పోలవ్వగా తెదేపా అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78,387 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థి ఎస్ఎల్ ఇరలక్కప్పకు 78322 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఇదే అత్యల్ప మెజారిటీగా తెలుస్తోంది.
అభ్యర్థి మార్పుతో గందరగోళం..
తొలత మడకశిర టీడీపీ టెకెట్ సునీల్ కుమార్‌కి ఇస్తామని ప్రకటించినా.. అభ్యర్థిని చంద్రబాబు మార్చడంతో స్తానిక తెదేపాకు సొంత శ్రేణుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇక్కడ ఎమ్మెస్ రాజు విజయంపై కొంత మేరకు అనుమానాలు తలెత్తాయి. అయితే చివరి వరకూ దోబూచులాడిన విజయం చివరికి తెదేపా పరం అవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది.