Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత ఎన్నికలు - సాయంత్రం 6వరకు 59.71 శాతం పోలింగ్, మరింత పెరిగే ఛాన్స్
Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా నిర్వహించిన తొలి విడత ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 60 శాతం ఓటింగ్ నమోదైంది. క్యూ లైన్లో ఉన్నవారు ఓట్లు వేసే అవకాశం ఉంది.
![Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత ఎన్నికలు - సాయంత్రం 6వరకు 59.71 శాతం పోలింగ్, మరింత పెరిగే ఛాన్స్ Lok Sabha Elections 2024 Phase 1 voting ends for the 18th Lok Sabha elections Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత ఎన్నికలు - సాయంత్రం 6వరకు 59.71 శాతం పోలింగ్, మరింత పెరిగే ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/19/17cc0c60281990f5e1bad0d074ca67961713531876480233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Elections 2024 Phase 1 voting ends: దేశ వ్యాప్తంగా జరుగుతున్న తొలి విడత ఎన్నికలు ముగిశాయి. 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 63.2 శాతం, రాజస్థాన్‌లో 50.3 శాతం, ఉత్తర్ ప్రదేశ్ 57.5 శాతం, మధ్యప్రదేశ్ 63.3 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిక్కింలో 67.5 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో 64.7 శాతం ఓటింగ్ నమోదైంది.
సాయంత్రం 6 గంటల వరకు అండమాన్ నికోబార్ లో 56.87 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో 64 శాతం, అస్సాంలో 70.77 శాతం, బిహార్ లో 46.32 శాతం, ఛత్తీస్ గఢ్ లో 63.41 శాతం, జమ్మూ కాశ్మీర్ లో 65.08 శాతం, లక్షద్వీప్ లో 59.02 శాతం, మధ్యప్రదేశ్ లో 63.25 శాతం, మహారాష్ట్రలో 54.85 శాతం, మణిపూర్ లో 68.62 శాతం, మేఘాలయలో 69.91 శాతం, మిజోరంలో 53.96 శాతం, నాగాలాండ్ లో 56.18 శాతం, పుదుచ్చేరిలో 72.84 శాతం, రాజస్థాన్ లో 50.27 శాతం, సిక్కింలో 68.06 శాతం, తమిళనాడులో 62.08 శాతం, త్రిపురలో 76.10 శాతం, ఉత్తర్ ప్రదేశ్ లో 57.74 శాతం, ఉత్తరాఖండ్ లో 53.56 శాతం, పశ్చిమ బెంగాల్ లో 77.57 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)