KCR : యూపీలో కేసీఆర్ ప్రచారం - నాలుగో తేదీన వారణాశిలో టూర్ ?
ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. నాలుగో తేదీన ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి కేసీఆర్ వారణాశిలో పర్యటించే అవకాశం ఉంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR ) ఢిల్లీ రాజకీయ పర్యటనలో కొన్ని సీక్రెట్ టూర్స్ కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కొంత మంది నేతలతో భేటీతో పాటు యూపీలో సమాజ్ వాదీ పార్టీకి ( UP Elections ) ప్రచారం చేయడం కూడా ఎజెండాలో ఉందని తెలుస్తోంది. నాలుగో తేదీన కేసీఆర్ ప్రధాని మోదీ ( PM Modi ) నియోజకవర్గం అయిన వారణాశిలో ( Varanasi ) కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ కేసీఆర్ 3 రోజులు ఢిల్లీలోనే ( Delhi ) ఉంటారు. పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపు ణులు, మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోనూ కేసీఆర్ వరుస భేటీలు జరుపుతారు.
గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు అందుకే, క్లారిటీ ఇచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, జాతీయ పార్టీల వైఫల్యాలు, ప్రజల ముందు పెట్టా ల్సిన ఎజెండా, కాంగ్రెస్, ( Congress ) బీజేపీయేతర రాజకీయ పార్టీలు.. సంస్థల భావసారూప్యత, ఏకతాటిపైకి రావడంలో ఉండే అవరోధాలు తదితర అంశాలపై ఈ భేటీల్లో కేసీఆర్ చర్చిస్తారు. అదే సమయంలో యూపీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. గతంలో కేటీఆర్ ( KTR ) కూడా యూపీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు రాలేదు.
దేశంలోనే తెలంగాణకు టాప్ ప్లేస్, ఏడేళ్లలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి ( Varanasi ) లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 7న ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన అక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్‌సీపీ నేత శరద్ పవార్ తదితరులు వెళ్లే అవకాశాలున్నాయి. వీరితో పాటు కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావిస్తున్నారు. అక్కడకు వెళ్తేనే అన్ని ప్రాంతీయపార్టీలతో కలిసి ఉన్నట్లుగా ఉంటుదని టీఆర్ఎస్ వర్గాలు కడా భావిస్తున్నాయి. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఇటీవల రెండు రోజుల పాటు హైదరాబాద్ ప్రశాంత్ కిషోర్‌తో ( Prasanth Kishore ) చర్చలు జరిపారు. ఆ తర్వాతే ఢిల్లీ టూర్‌కు వచ్చారు.