News
News
వీడియోలు ఆటలు
X

karnataka election results 2023 : మాది చిన్న పార్టీ, మాకు పెద్ద డిమాండ్ ఏముంటుంది: కర్ణాటక ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు ముందు JDS కుమారస్వామి

karnataka election results 2023 : కౌంటింగ్‌కు ముందు జెడి (ఎస్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ, కర్ణాటకలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది మరో రెండు మూడు గంటల్లో తేలిపోతుందని అన్నారు.

FOLLOW US: 
Share:

karnataka election results 2023 : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జెడి(ఎస్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి... కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారన్నారు. తమది చాలా చిన్న పార్టీ అని తమకు కొన్ని సీట్లే వస్తాయని అంచనా వేస్తున్నారని చెప్పారు. మరికొన్ని గంటల్లోనే దీనిపై క్లారిటీ వస్తుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఒక వేళ హంగ్ వచ్చే పరిస్థితి ఉంటే తాము కింగ్ మేకర్‌ అవుతామని తెలిపారు. 

ఈసారి కర్ణాటకలో ఎవరు గెలుస్తారో చూడాలని అందరి దృష్టి ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌పైనే ఉంది. మే 10న కర్ణాటకలో ఒకే దశలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 72 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, దూకుడుగా ఉన్న కాంగ్రెస్, దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. బెంగళూరు, సెంట్రల్, కోస్టల్, హైదరాబాద్-కర్ణాటక, ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక లేదా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలోని ఆరు ప్రాంతాల్లో కీలక పోటీ ఉంది. ముంబై-కర్ణాటక, దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాంతాలు వరుసగా 50, 51 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో రెండు పార్టీల నేతలు ఫలితంపై ఉత్కంఠగా ఉన్నారు. హంగ్ వస్తుందని జెడి (ఎస్) అంచనా వేస్తోంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆఫర్ కూడా ప్రకటించింది. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్‌కు స్వల్ప మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. 

Published at : 13 May 2023 08:33 AM (IST) Tags: Abp live Breaking News Elections 2023 Karnataka Elections 2023 Karnataka Election 2023 Karnataka Election 2023 Date Karnataka Assembly Elections 2023 Karnataka Election Karnataka Election Result 2023 ABP Desam LIVE Karnataka Results Live Karnataka Election Results Live

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates:  ప్రమాణ స్వీకారం చేసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ - కంఠీరవ స్టేడియంలో కోలాహలం

Breaking News Live Telugu Updates: ప్రమాణ స్వీకారం చేసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ - కంఠీరవ స్టేడియంలో కోలాహలం

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎం పట్టాభిషేకానికి విపక్ష నేతల తరలిరావడం వెనుక అసలు కారణం అదేనా?

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎం పట్టాభిషేకానికి విపక్ష నేతల తరలిరావడం వెనుక అసలు కారణం అదేనా?

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎంగా నేడు సిద్దరామయ్య ప్రమాణం- హాజరుకానున్న అగ్రనాయకత్వం

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎంగా నేడు సిద్దరామయ్య ప్రమాణం- హాజరుకానున్న అగ్రనాయకత్వం

Karnataka Chief Minister: కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది, శివకుమార్‌ను ఎలా కూల్ చేసింది, సిద్దూని ఎలా సీఎంను చేసింది?

Karnataka Chief Minister: కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది, శివకుమార్‌ను ఎలా కూల్ చేసింది, సిద్దూని ఎలా సీఎంను చేసింది?

వీహెచ్‌ కామెట్స్ సీరియస్‌గా తీసుకున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ బీసీ నేతలు- 3 స్థానాలు కావాలంటూ డిమాండ్!

వీహెచ్‌ కామెట్స్ సీరియస్‌గా తీసుకున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ బీసీ నేతలు- 3 స్థానాలు కావాలంటూ డిమాండ్!

టాప్ స్టోరీస్

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!