అన్వేషించండి

Pawan Kalyan: 'ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటా' - జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP News: తాను జగన్‌లా రూపాయి జీతం తీసుకోనని.. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఫలితాలు మరింత బాధ్యత పెంచాయని అది అనుక్షణం గుర్తు రావాలని అన్నారు.

Pawan Kalyan Interesting Comments On His MLA Salary: ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం తర్వాత జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు మరింత బాధ్యత పెంచాయని అన్నారు. 'నేను కూడా ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా. ఎందుకంటే ఈ డబ్బు ప్రజల రక్తం, చమట, స్వేదం నుంచి వచ్చింది. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా నాకు ఆ బాధ్యత అనుక్షణం గుర్తు రావాలి. ఒకవేళ నేను సరిగా పని చేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. అందుకే పూర్తి జీతం తీసుకుంటాను. ఆ తర్వాత ఇవ్వాల్సింది ఎలాగో ఇచ్చేస్తాను. అందరం కూడా జవాబుదారి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం.' అని పవన్ పేర్కొన్నారు.

'బాధ్యతతో ఉండాల్సిన సమయం'

ఇది పండుగ చేసుకునే సమయం కాదని.. బాధ్యతతో ఉండాల్సిన సమయమని పవన్ కల్యాణ్ అన్నారు. చట్టాలను చేసేవాళ్లు ఎలా ఉండాలో చూపిద్దామని.. పార్లమెంటుకు వెళ్లేది ప్రజల కోసం పని చేయడానికే అని గుర్తుంచుకోవాలన్నారు. రక్తం ధారబోసిన జనసైనికులు, వీర మహిళలు పార్టీని గెలిపించారని చెప్పారు. 'కేంద్రంలో కీలకం కాబోతున్నాం. ఎంపీలు ఉదయ్, బాలశౌరికి చాలా బాధ్యత ఉంది. ఢిల్లీ జనసేన ఎంపీల కదలికలను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది అద్భుత విజయం. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడం చారిత్రాత్మక విజయం.' అని పవన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఎంత బాధ్యతగా ఎలా పని చేశామో.. అంతకు మించిన స్థాయిలో ఇక నుంచి కూడా పార్టీ కోసం పని చేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సూచించారు.

Also Read: Jr NTR on Chandrababu: మావయ్యకు, బాబాయికి శుభాకాంక్షలు - ఏపీ రిజల్ట్‌పై జూ.ఎన్టీఆర్ అదిరిపోయే స్పందన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Formation Day: సనాతన పరిరక్షణ, పార్టీ విస్తరణ.. అజెండాతోనే జనసేన ప్లీనరీ...!
సనాతన పరిరక్షణ, పార్టీ విస్తరణ.. అజెండాతోనే జనసేన ప్లీనరీ...!
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Telangana Latest News: జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆందోళన-నేడు రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం
జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆందోళన-నేడు రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం
Happy Holi Wishes : హోలీ శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్​లతో విషెష్ చెప్పేయండి
హోలీ శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్​లతో విషెష్ చెప్పేయండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvatmala project Explained in Telugu | రోడ్లు వేయలేని మార్గాల్లో రోప్ వే తో మహారాజులా ప్రయాణం |ABPMS Dhoni Dance in Pant Sister Marriage | అన్నీ మర్చిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేసిన ధోనీ | ABP DesamHow To Use Shakthi App | శక్తి యాప్ తో ఎక్కడికెళ్లినా సేఫ్ గా ఉండండి | ABP DesamChitrada Public Talk | చిత్రాడలో జనసేన విజయకేతనం సభపై స్థానికుల అభిప్రాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Formation Day: సనాతన పరిరక్షణ, పార్టీ విస్తరణ.. అజెండాతోనే జనసేన ప్లీనరీ...!
సనాతన పరిరక్షణ, పార్టీ విస్తరణ.. అజెండాతోనే జనసేన ప్లీనరీ...!
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Telangana Latest News: జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆందోళన-నేడు రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం
జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆందోళన-నేడు రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం
Happy Holi Wishes : హోలీ శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్​లతో విషెష్ చెప్పేయండి
హోలీ శుభాకాంక్షలు.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాలో ఈ ఫోటోలు షేర్ చేసి, ఈ మెసేజ్​లతో విషెష్ చెప్పేయండి
Hit And Run Case: హైదరాబాద్‌లో కారు బీభత్సం, వరుస యాక్సిడెంట్లు చేసిన డ్రైవర్‌ను పట్టుకున్న ట్రాఫిక్ ఎస్సై
హైదరాబాద్‌లో కారు బీభత్సం, వరుస యాక్సిడెంట్లు చేసిన డ్రైవర్‌ను పట్టుకున్న ట్రాఫిక్ ఎస్సై
Janasena Plenary: జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే వారికి అలర్ట్ - మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, పోలీసుల భారీ బందోబస్తు
జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే వారికి అలర్ట్ - మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, పోలీసుల భారీ బందోబస్తు
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘బాషా’, వెంకటేష్ ‘సైంధవ్’ to ప్రభాస్ ‘బుజ్జిగాడు’, కార్తీ ‘యుగానికి ఒక్కడు’ వరకు - ఈ శుక్రవారం (మార్చి 14) హోలీ స్పెషల్‌గా టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘బాషా’, వెంకటేష్ ‘సైంధవ్’ to ప్రభాస్ ‘బుజ్జిగాడు’, కార్తీ ‘యుగానికి ఒక్కడు’ వరకు - ఈ శుక్రవారం (మార్చి 14) హోలీ స్పెషల్‌గా టీవీలలో వచ్చే సినిమాలివే
MI In WPL Finals: ఫైన‌ల్లో ముంబై.. బ్రంట్, హీలీ ఫిఫ్టీలు.. 47 ప‌రుగుల‌తో గుజ‌రాత్ చిత్తు.. ఫైన‌ల్లో ఢిల్లీతో ముంబై ఢీ
ఫైన‌ల్లో ముంబై.. బ్రంట్, హీలీ ఫిఫ్టీలు.. 47 ప‌రుగుల‌తో గుజ‌రాత్ చిత్తు.. ఫైన‌ల్లో ఢిల్లీతో ముంబై ఢీ
Embed widget