Jr NTR on Chandrababu: మావయ్యకు, బాబాయికి శుభాకాంక్షలు - ఏపీ రిజల్ట్‌పై జూ.ఎన్టీఆర్ అదిరిపోయే స్పందన
AP Latest News: తమ కుటుంబం నుంచి ఎన్నికల్లో నిలిచి గెలుపొందిన అందరినీ జూనియర్ ఎన్టీఆర్ అభినందించారు. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ వరసలతో పిలుస్తూ అందర్నీ ప్రశంసించారు.
![Jr NTR on Chandrababu: మావయ్యకు, బాబాయికి శుభాకాంక్షలు - ఏపీ రిజల్ట్‌పై జూ.ఎన్టీఆర్ అదిరిపోయే స్పందన Junior NTR responds over TDP grand victory in AP elections congratulates Chandrababu nara Lokesh Balakrishna Jr NTR on Chandrababu: మావయ్యకు, బాబాయికి శుభాకాంక్షలు - ఏపీ రిజల్ట్‌పై జూ.ఎన్టీఆర్ అదిరిపోయే స్పందన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/d8d07f7dc37a01bb79fecced2ae2267a1717581895577234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Junior NTR on AP Election Result: ఏపీ ఎన్నికల ఫలితాలపై అగ్ర నటుడు, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తమ కుటుంబం నుంచి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందిన ప్రతి ఒక్కరిని జూనియర్ ఎన్టీఆర్ అభినందించారు. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ వరసలతో పిలుస్తూ అందర్నీ ప్రశంసించారు.
‘‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీగా గెలిచిన శ్రీభరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
— Jr NTR (@tarak9999) June 5, 2024
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన @PawanKalyan గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
— Jr NTR (@tarak9999) June 5, 2024
‘‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు! మీ కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్ కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేశ్, శ్రీభరత్, పురందేశ్వరి అత్తకు నా శుభాకాంక్షలు’’ అని నందమూరి కల్యాణ్ రామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన @ncbn మావయ్యకీ, @JaiTDP నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 5, 2024
మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను.
వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం…
‘‘జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు’’ అని కల్యాణ్ రామ్ మరో పోస్ట్ చేశారు.
జనసేన అధ్యక్షులు @pawankalyan గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 5, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)