ఎంవీవీపై జనసేన విశాఖ అధ్యక్షుడు ఫైర్- ఎంపీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్!
Vamsi Krishna Srinivas Yadav fires on MP Mvv : విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంవీవీపై వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు.
Jana Sena City President Vamsi Fires On MP Mvv : విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, జనసేన నగర అధ్యక్షుడు, మాజీ వైసీపీ నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఎంపీ ఎంవివి సత్యనారాయణపై వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. వంశీ చేసిన విమర్శలకు దీటుగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శుక్రవారం మీడియా ముఖంగా బదులిచ్చారు. ఎంపీ వ్యాఖ్యలకు కౌంటర్ గా శుక్రవారం సాయంత్రం వంశీ మరోసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన వంశీ.. తూర్పు నియోజకవర్గంలో ఎంవివి సత్యనారాయణ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు.
పవన్ అంగీకరించి నగర బాధ్యతలు అప్పగించారు
ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్నది తన కోరిక అని, ఆ మాటను పవన్ కళ్యాణ్ కు చెప్పగానే అంగీకరించి నగర పార్టీ బాధ్యతలు అప్పగించారని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ఎవరి మీద వ్యక్తి గత విమర్శలు చేయనని చెప్పానని, అదే మాట మీద ఉన్నానన్నారు. ఎంవీవీ మాత్రం విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. బంధువుల దగ్గర ఎంపి తనను చులకన చేసి మాట్లాడాడని, అది మర్చిపోనన్నారు. చెమ్చాలు కుమార్, జీవిల గురించి మాట్లాడితే కార్పొరేటర్లతో, మేయర్ తో మాట్లాడించడం ఎందుకు అని ప్రశ్నించారు. కులం పేరుతో ఎంవీవీ తిట్టిన విషయాన్ని ఆయన పక్కన ఉన్న వారంతా గుర్తించాలని వంశీ సూచించారు. ఎంవీవీ విశాఖ వచ్చే నాటికి తాను కోటీశ్వరుడని అని, నీ జీవితానికినా జీవితానికి పోలిక ఏంటి..? ఎంపీని ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. 2700 ఓట్లు మెజారిటీతో కార్పొరేటర్ గా గెలిచానని, మీరంతా తనకు వ్యతిరేకంగా పనిచేసిన బంపర్ మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జీఎస్టి కమీషనర్ తో ఎన్ని సార్లు రైడ్ చేయించావో మర్చిపోయావా..? అని వంశీ నిలదేశారు.
విశాఖలో అత్యధిక అప్పులు నీకే ఉన్నాయని, ఆ విషయం మర్చిపోయి మాట్లాడొద్దని హితవు పలికారు. మంత్రి అవ్వాలని తానెప్పుడూ చెప్పలేదని, అడ్డగోలుగా మాట్లాడ వద్దని హితవు పలికారు. తన జాతి గురించి మాట్లాడే సీన్ నీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎంపిగా ఉండి తన్నులు తిన్న స్థాయి నీదని, స్థాయి గురించి నువ్వు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు దగ్గర కి వెళ్ళడానికి అపాయింట్మెంట్ అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. జైల్లో తన్నిన తన్నులు గుర్తు వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు ఇతరుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. నీలాంటి వారి వల్లే వైసీపీ ప్రభుత్వం ఓడిపోబోతోందని వంశీ స్పష్టం చేశారు. కొయ్య ప్రసాద్ రెడ్డి తన వద్దకు ఎంపీ ఎంవివి సత్యనారాయణను తన దగ్గరకు మూడుసార్లు తీసుకొచ్చాడని, ఆ విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు.
సీటు రాకుండా చేసింది ఎంవీవీ
తనకు 2019 లో నాకు సీటు రాకుండా ఆపింది ఎంవీవీనే అని, ఈ విషయాన్ని స్వయంగా అతనే ఒప్పుకున్నాడన్నారు. ఎంవీవీ విశాఖ లో గెలిస్తే రాజకీయాలు మానేస్తానని ఈ సందర్భంగా వంశీ శపథం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు పాలకులు వాళ్ళ ఆస్తులు దారాదత్తం చేసేవరని, కానీ ఎంపి ఎంవీవీ విశాఖ నగరంలో ఆస్తులు కాజేయడం, కబ్జా చేయడం పరిపాటిగా పెట్టుకున్నారన్నారు. శ్రీకృష్ణ రూపం నల్లగా ఉంటుందని, అలాంటి యాదవ జాతిని దిగజార్చే స్థాయిలో ఎంవీవీ మాట్లాడారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్దపురంలో బోగపు వేష దారి లాంటి ఎంవీవీకి వంశీ కృష్ణని విమర్శించే స్థాయి ఉందా అని ప్రశ్నించారు.