News
News
వీడియోలు ఆటలు
X

Karnataka Election 2023 : భజరంగ్ దళ్ వివాదం కాంగ్రెస్ వేసిన ట్రాపా ? బీజేపీ బుక్కయిందా ?

భజరంగ్ దళ్ వివాదంతో కాంగ్రెస్ వేసిన ట్రాప్‌లో బీజేపీ పడిందా ?

FOLLOW US: 
Share:

Karnataka Election 2023 :  కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ప్రచారం చేసింది బజరంగ్ దళ్ నిషేధం అనే అంశంపైనే. హనుమాన్ చాలీసాలు చదివి చేయాల్సినంత రచ్చ చేశారు. " భజరంగ్ దళ్‌పై నిషేధం "  అనే హామీని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మేనిఫెస్టోలో పెట్టింది. ఇలా ఆ పార్టీ పెట్టడం ఆలస్యం భారతీయ జనతా పార్టీ అందుకుంది.  మొత్తం భజరంగభళి చుట్టూ నడిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు. మరికొంత పెంచే ప్రయత్నమే చేసింది. ఎందుకలా చేసిందో ఇప్పుడు ఫలితాలు చెబుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఉచిత  హామీలన్నీ పక్కకపోయి ఓటింగ్ అంశంగా మారిన భజరంగ్ దళ్ నిషేధ  అంశం 
  
కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు  ఇంటికి పాలు తెచ్చిస్తామని కూడా హామీలిచ్చేశారు.  కాంగ్రెస్‌ మేనిఫెస్టో కూడా హామీల వాన కురిపిస్తూనే వివాదాస్పద నిర్ణయమొకటి ప్రకటించింది. తాము అధికా రంలోకి వస్తే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే సంస్థలను నిషేధిస్తామని చెబుతూ ఉదాహరణలుగా పిఎఫ్‌ఐ, బజరంగ్‌దళ్‌ సంస్ధలను కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో ఉటంకించింది.   ఇది వివాదాస్పద నిర్ణయమే. ఇది బీజేపీకి అస్త్రంలా మారుతుందని ఎవరైనా అనుకుంటారు. అయినా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది.  బీజేపీ ఇంత కన్నా అవకాశం ఏమి ఉంటుందని అందుకుంది. కానీ ఇప్పుడు తొందరపడ్డామని నాలిక్కరుచుకోవాల్సి వచ్చింది. 

బీజేపీ వస్తే మత వివాదాలుంటాయని బీజేపీ ద్వారానే ప్రజల్లోకి పంపిన కాంగ్రెస్ 

 మత విద్వేషా లను రెచ్చగొట్టి, మైనారిటీలకు మెజారిటీ ప్రజలకు మధ్య చిచ్చు పెట్టే శక్తులపై గాని సంస్థðలపై చర్యలు తీసుకోవాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే  ప్రజలు ప్రశాంతమైన జీవనాన్నే కోరుకుంటారు. చాలా సందర్భాల్లో భజరంగ్ దళ్ వ్యవహారం వివాదాస్పదమయింది.  అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన ప్రశాంతతను ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది.   కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకో వాలన్నది బీజేపీ లక్ష్యం. ఏడదిగా ఆ లక్ష్యంతోనే పాచిక లు కదిపింది. హిజాబ్‌ వివాదం, ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి మత సంబంధిత అంశాలను ఎన్నికల అస్త్రాలుగా చేసుకోవాలని ప్రయత్నించింది. మత పరమైన అంశంపై దూకుడుగా స్పందించడం వల్ల.. బీజేపీకి హిందూ వర్గాల్లోనూ వ్యతిరేకత వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.  దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడంపై.. మెజార్టీ హిందువులు సంతృప్తి చెందరు. ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు ఇష్,టం ఉండదు.  

వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఎజెండాను కాంగ్రెస్ ఖరారు చేసిందా ?

అసెంబ్లి ఎన్నికల స్ధాయిలో విడుదలైన మేనిఫెస్టో జాతీయ స్ధాయిలో వివాదాస్పదం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ప్రయత్నం చేసింది. ఆ ట్రాప్‌లో బీజేపీ పడిందన్న అభిప్రాయం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల ప్రజలు భజరంగ్ దళ్‌పై నిషేధాన్ని స్వాగతించినట్లే అవుతుంది. ఆ సంస్థ నిర్వాకాలపై దేశవ్యాప్త వ్యతిరేకత  పెంచడం ద్వారా..  మత ఉద్రేకాలు రెచ్చగొట్టే వ్యవహాహాలను అణిచి వేస్తామని దేశంలో మళ్లీ లౌకిక వాదం తీసుకు వస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చే దిశగా ఈ భజరంగ్ దళ్ వివాదంతో వ్యూహం పన్నిందన్న డౌట్ ఇప్పుడు  బీజేపీ నేతలకు వస్తోంది.  

రాజకీయాల్లో ఏదీ ఆవేశంతో చేయకూడదు. అన్నీ ఆలోచనతోనే చేయాలి. కాంగ్రెస్ పార్టీ భజరంగ్ దళ్‌ను ఎందుకు ఎన్నికల్లోకి తెచ్చిందో బీజేపీ పెద్దలు కొన్న గంటల పాటు సమీక్ష చేసుకుని ఉంటే.. కర్ణాటకలో అభివృద్ధి ప్రచారం నుంచి దృష్టి మరల్చేవారు కాదేమో. కానీ ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Published at : 13 May 2023 03:19 PM (IST) Tags: Abp live ABP Desam Karnataka Election 2023 Karnataka Assembly Elections 2023 Karnataka Election Result 2023 Karnataka Election Result Live Karnataka Results Live

సంబంధిత కథనాలు

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Breaking News Live Telugu Updates: ప్రమాణ స్వీకారం చేసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ - కంఠీరవ స్టేడియంలో కోలాహలం

Breaking News Live Telugu Updates:  ప్రమాణ స్వీకారం చేసిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ - కంఠీరవ స్టేడియంలో కోలాహలం

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎం పట్టాభిషేకానికి విపక్ష నేతల తరలిరావడం వెనుక అసలు కారణం అదేనా?

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎం పట్టాభిషేకానికి విపక్ష నేతల తరలిరావడం వెనుక అసలు కారణం అదేనా?

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎంగా నేడు సిద్దరామయ్య ప్రమాణం- హాజరుకానున్న అగ్రనాయకత్వం

Karnataka CM Swearing-In: కర్ణాటక సీఎంగా నేడు సిద్దరామయ్య ప్రమాణం- హాజరుకానున్న అగ్రనాయకత్వం

Karnataka Chief Minister: కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది, శివకుమార్‌ను ఎలా కూల్ చేసింది, సిద్దూని ఎలా సీఎంను చేసింది?

Karnataka Chief Minister: కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది, శివకుమార్‌ను ఎలా కూల్ చేసింది, సిద్దూని ఎలా సీఎంను చేసింది?

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్