Andhra Pradesh News : ఉద్యోగ సంఘాల నేత వెంకటరామిరెడ్డి ఎన్నికల ప్రచారం- జగన్‌కు అండగా నిలబడాలని బహిరంగల్ లేఖ
CM Jagan should raise the prestige of the government : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా కృషి చేయాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh News : సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది కృషి చేయాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ ఆ లేఖలో కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే మారుమూల గ్రామీణ ప్రజలకు సొంత గ్రామాల్లోనే సంపూర్ణంగా ప్రభుత్వ సేవలు అందించే లక్ష్యంతో గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు ప్రస్తావించారు. ఈ వ్యవస్థ ద్వారా 1.36 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారన్నారు. మరో 2.66 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించారని, తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పించిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిష్టను మనము పెంచాలని ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు సూచించారు.
గ్రామంలో సేవలు అందేలా వ్యవస్థ
ఉన్న ప్రాంతంలోనే సేవలు అందేలా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. ప్రతి సచివాలయంలో పదిమంది ఉద్యోగులను నియమించి ప్రజలు ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేశారని వెంకటరామిరెడ్డి లేఖలో వెల్లడించారు. చెప్పిన మాట ప్రకారమే సీఎం జగన్ మూడు నెలల్లోనే పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారని, సచివాలయాలు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. సచివాలయాల ఉద్యోగులకు సమస్యలు లేవని, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదని, సమస్యలు ఒకటి పోతే ఒకటి రిటైర్ అయ్యేవరకు వస్తూనే ఉంటాయన్నారు. ఆయా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందామని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టనష్టాలు కూర్చి సచివాలయాల వ్యవస్థను రూపొందించారన్నారు.
కొందరు ఓర్వలేక రకరకాలుగా మాట్లాడుతున్నారని, ప్రొబెషన్ ఖరారు కాకముందు ఎంతోమంది హేళన చేశారన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు వెంకటరామిరెడ్డి. తాము అధికారంలోకి వస్తే సచివాలయాల ఉద్యోగులను తొలగిస్తామని ఒక మాజీ మంత్రి చెప్పినట్లు వార్తలు వచ్చాయని, మరో ముఖ్య నాయకుడు ఈ వ్యవస్థ పనికిమాలినదంటూ విమర్శలు చేసిన విషయాన్ని వెంకటరామిరెడ్డి లేఖలో ప్రస్తావించారు. మరో నాయకుడు ఈ వ్యవస్థలో భాగమైన వాలంటీర్ల గురించి నీరసంగా మాట్లాడారని, కానీ సచివాలయ వ్యవస్థను టచ్ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. ఒకవైపు ఈ వ్యవస్థ గురించి అవమానకరంగా మాట్లాడుతూనే ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు చూస్తున్నారని వెంకటరామిరెడ్డి విమర్శించారు.
సీఎం జగన్ సచివాలయాల ఉద్యోగులపై నమ్మకం ఉంచి కీలక స్థానాన్ని కల్పించారన్నారు. ఆ నమ్మకాన్ని ప్రతి ఉద్యోగి నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని చానల్స్, పత్రికలు విషపు రాతలతో అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, మానసిక దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 50 రోజుల్లో కనీసం వంద మందిని చైతన్యం చేయాలని కోరుతున్నానని అంటూ వెంకటరామిరెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలిస్తేనే ప్రొబెషన్ ఇస్తామని చెప్పేవారు
సీఎం జగన్ మోహన్ రెడ్డి స్థానంలో మరో ఎవరైనా ఉంటే సచివాలయాలు వ్యవస్థ ఏర్పాటు హామీ ఎంత వేగంగా అమలయ్యేది కాదన్నారు. సచివాలయాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయాలనుకుంటే.. ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఏడాది పట్టేదని, ఆ తరువాత ఉద్యోగాల నియామక నోటిఫికేషన్కు మరో ఏడాది, పరీక్షలకు ఇంకో ఏడాది, నియామకాలకు మరో ఏడాది తీసుకొని.. 2024 ఎన్నికలకు నియామకాలు చేపట్టేవారన్నారు. ఆ తరువాత ఎన్నికల్లో గెలిస్తేనే ప్రొబెషన్ ఇస్తామని ఓట్ల రాజకీయం చేసే వారిని, కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవేమీ ఆలోచించకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే ఎంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు.
సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కరోనా రూపంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవడంతో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ వాయిదా వేయాలని అధికారులు ఒత్తిడి చేశారన్నారు. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రొఫెషన్ డిక్లేర్ చేసి కొత్త పిఆర్సి ప్రకారం జీతాలు ఇచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తించుకోవాలని వెంకటరామిరెడ్డి కోరారు.