అన్వేషించండి

Chandrababu: ఏపీ సీఎంగా చంద్రబాబు - నెరవేరనున్న నిరుద్యోగుల కల, తొలి సంతకం దానిపైనే!

Andhrapradesh News: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత తొలి సంతకం దేనిపై అన్నదానిపైనే ఇప్పుడు అందరి చూపూ ఉంది. హామీ ఇచ్చిన విధంగానే ఆయన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉండనుంది.

Chandrababu First Signature On Mega Dsc: డీఎస్సీ.. లక్షలాది మంది నిరుద్యోగుల కల. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని ప్రతి ఒక్క యువత కోరుకుంటారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అడుగులు పడబోతున్నాయి. నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులను ఆకర్షించేలా.. అభివృద్ధి, ఉపాధి వంటివే ధ్యేయంగా.. కూటమి తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12న ఏపీ సీఎంగా అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత హామీలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టనున్నారు. అయితే, ఆయన తొలి సంతకం చేయబోయే ఫైల్‌పై అంతటా ఉత్కంఠ నెలకొంది.

ఫస్ట్ సైన్.. మెగా డీఎస్సీ

అవును.. ఫస్ట్ సైన్ మెగా డీఎస్సీపైనే. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తొలి సంతకం డీఎస్సీపైనే అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వెనువెంటనే టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని యత్నించింది. అయితే, నిరుద్యోగులు తగినంత సమయం ఇవ్వడం లేదని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నిరుద్యోగ యువతపై ఫోకస్ పెట్టారు. అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికిషేన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగులు ఎక్కువగా కూటమి వైపు మొగ్గు చూపారన్నది విశ్లేషకుల మాట. కూటమి అఖండ విజయంతో ఇక నిరుద్యోగుల కల.. మెగా డీఎస్సీకి మార్గం సుగమం అవుతోందని చెబుతున్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేయనుండగా.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించి సంపద సృష్టించి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కూడా చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు.

రెండో సైన్.. దేనిపై అంటే.?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ఎన్నికలకు ముందు ఇంతలా చర్చనీయాంశమైన అంశం మరొకటి లేదు. భూహక్కు చట్టం ద్వారా ప్రభుత్వం భూముల్ని లాక్కొనే ప్రయత్నం చేస్తుందన్న కూటమి నేతల వాదనలతో గ్రామీణ, అర్బన్ ఓటర్లు ఏకీభవించారు. అంతేకాకుండా ల్యాండ్ పాస్ బుక్‌పై అప్పటి సీఎం జగన్ ఫోటో ఉండడంపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండో సంతకం దానిపైనే చేస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సైన్ చేయనున్నారు.

మూడో సైన్.. పెరగనున్న పింఛన్

పెన్షన్.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వంటి వారికి ప్రభుత్వం నెలా నెలా అందించే లబ్ధి. వైసీపీ అధినేత జగన్ హయాంలో రూ.2 వేల నుంచి దశలవారీగా రూ.3 వేలకు పెంచారు. ఈ క్రమంలో పెన్షనర్లకు ఊరటగా అధికారంలోకి రాగానే.. పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెరిగిన పెన్షన్‌ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ క్రమంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల పెంపుపైనే మూడో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పెన్షనర్లకు భారీగా లబ్ధి చేకూరనుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget