అన్వేషించండి

Ap Elections 2024: పోలీస్ బందోబస్తుతో వెళ్లి ఓటేసిన కుటుంబం - ఆలస్యంగా వెలుగులోకి, ఎందుకో తెలుసా?

Andhra Pradesh News: ఎన్నికల్లో ఓ కుటుంబం బందోబస్తు మధ్య ఓటేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఓ సమస్యపై ఈసీకి ఫిర్యాదు చేయగా వారి సూచన మేరకు వారికి భద్రత కల్పించారు.

Family Casted Their Vote With Security: ఓటు.. సామాన్యులకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ఐదేళ్లకోసారి తమను ఎన్నుకునే నాయకున్ని నిర్భయంగా ఎన్నుకునే ప్రక్రియ. ఈ నెల 13న ఏపీలో ఎన్నికల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ ఎన్నికల్లో ఓ కుటుంబం మాత్రం పోలీస్, రెవెన్యూ అధికారుల బందోబస్తు మధ్య వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భద్రత మధ్య ఎందుకంటే.?

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలోని అమలాపురం (Amalapuram) పట్టణంలో ఓ కుటుంబానికి స్థానికులతో రహదారి వివాదం ఉంది. తాము ఓటేసేందుకు వెళ్లాలంటే ఆ దారి గుండానే వెళ్లాలి. అయితే, వివాదంతో తమను ఆ మార్గంలో అనుమతించరని, ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆ కుటుంబం భావించింది. ఈ క్రమంలో తమ సమస్యను వివరిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై పరిశీలించిన ఈసీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అక్కడి నుంచి ఎన్నికల పరిశీలకుడికి తగు ఆదేశాలు అందడంతో పోలింగ్ రోజున ఓ కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బందిని ఆ కుటుంబానికి భద్రతగా పంపించారు. బందోబస్తు మధ్య ఆ కుటుంబం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు వేశారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Ap Elections 2024: ఎన్నికల కౌంటింగ్ - ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget