అన్వేషించండి

Ap Elections 2024: ఎన్నికల కౌంటింగ్ - ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

Conuting Agents: జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా, కౌంటింగ్ రోజున ఏజెంట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Rules To Counting Agents On Election Counting: ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ సాగనుంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతతో ఈవీఎంలు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ రోజున తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టిన అనంతరం ఈవీఎంల్లో ఓట్లు లెక్కిస్తారు. ఈ క్రమంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, టేబుళ్ల ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించేందుకు చర్యలు చేపడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలోనే మీడియా సెంటర్లు ఏర్పాటు చేసి బిగ్ స్క్రీన్స్‌లో ఫలితాలు వెల్లడయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద హైస్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించనున్నారు. కాగా, కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ఈ రూల్స్ పాటించాలి

  • కౌంటింగ్ ఏజెంట్లు కేంద్రాలకు ఉదయం 6 గంటల్లోపు వెళ్లాలి. ఫాం 18పై రిటర్నింగ్ అధికారితో సంతకం చేయించి తీసుకోవాలి.
  • అనంతరం మీకు ఇచ్చే ఐడీ, ఆధార్, ఫాం 17C, బుక్ లెట్, పెన్ తీసుకెళ్లాలి. కౌంటింగ్ కేంద్రాలకు మొబైల్స్ అనుమతించరు. ఒకసారి లోపలికి వెళ్లాక మళ్లీ ప్రక్రియ పూర్తయ్యే వరకూ బయటకు వచ్చేందుకు అనుమతించరు.
  • ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఫలితాలకు సంబంధించి వేర్వేరుగా కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. మీకు కేటాయించిన టేబుల్ నెంబర్ వద్ద కూర్చోవాలి.
  • ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ ఆఫీసర్, అబ్జర్వర్ ఉంటారు. అలాగే, ఓ ఆర్వో, ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏజెంట్ ఉంటారు. 
  • ఏ పోలింగ్ బూత్‌ల నుంచి కంట్రోల్ యూనిట్స్ ఏ టేబుల్‌కు వెళ్లాలనేది ముందుగానే నిర్ణయిస్తారు.
  • పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత, ఈవీఎంల కౌంటింగ్ ఉంటుంది. ఏజెంట్లు కంట్రోల్ యూనిట్ల యంత్రాల సీల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకుంటే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి.
  • అనంతరం 17C ఫాం వివరాలు అధికారులు చెప్పిన వాటితో సరి చూసుకోవాలి. ఫలితాలు వెల్లడవుతున్నప్పుడు పోలింగ్ తేదీ, పోలైన ఓట్లను సరి చూసుకోవాలి. మీ దగ్గర ఉన్న 17C ఫాంలోని వివరాలు అక్కడ వాటితో తేడాగా ఉంటే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. 
  • ఫలితాలు వెల్లడి సమయంలో మీ అభ్యర్థి వివరాలతో సహా అన్నీ నోట్ చేసుకోవాలి. మీతో పాటు అన్ని ఫలితాలను కూడా కౌంటింగ్ సూపర్వైజర్ కూడా నోట్ చేస్తారు.
  • ఫలితాలు మీరు మళ్లీ చూడాలని అనుకుంటే రిటర్నింగ్ అధికారిని అడిగితే మెషీన్ లో బటన్ నొక్కి చూపిస్తారు. అంతా సవ్యంగా పూర్తైతే కౌంటింగ్ సూపర్వైజర్ ఇచ్చిన 17C ఫాం పార్ట్ 2పై సంతకం చేయాలి. అందరికీ సమ్మతమైతే ఆ ఫాంను ఆర్వోకు అందించి ఫలితాలు వెల్లడిస్తారు. 
  • 'ఫాం 17C' ఇంకో అధికారికి అందిస్తారు. ఆ వివరాలు 'ఫాం 20'లో భద్రపరుస్తారు. నియోజకవర్గంలో అన్ని కంట్రోల్ యూనిట్స్ పూర్తైన తర్వాత వీపీ ప్యాట్ మెషీన్స్‌లో పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తారు. ఈ నెంబరు దానికి సంబంధించి కంట్రోల్ యూనిట్‌లో నెంబర్ సరిపోలుస్తారు.

ఈ సమస్యలుంటే..

  • కంట్రోల్ యూనిట్స్ తెచ్చినప్పుడు సీల్స్ సరిగ్గా లేకున్నా.. రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. గ్రీన్ సీల్ బ్రేక్ అయి ఉంటే ఆర్వోకి చెప్పాలి. ఆయన అది తీసుకెళ్లి దానికి సంబంధించిన వీవీ ప్యాట్ మెషీన్ ను తెప్పించి దానిలో స్లిప్స్ కౌంట్ చేస్తారు. అయితే, ఈ ప్రక్రియ కౌంటింగ్ చివరలో సాగుతుంది.
  • ఒకవేళ కంట్రోల్ యూనిట్ ఆన్ కాకుంటే ఆర్వోకి తెలియజేయాలి. ఆయన సరిచేస్తారు. అప్పటికీ పని చేయకపోతే.. పక్కకు తీసుకెళ్లి ఆ కంట్రోల్ యూనిట్ కు సంబంధించి వీవీ ప్యాట్ స్లిప్స్ కౌంట్ చేస్తారు.
  • మీ '17C ఫాం' లోని మొత్తం ఓట్లు కంట్రోల్ యూనిట్‌లో చూపించిన ఓట్లు తేడా ఉంటే ఆర్వోకి తెలియజేయాలి. ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ బయటకు రావద్దు. ఇంకా ఏమైనా సందేహాలుంటే ఎన్నికల సంఘం ఇచ్చిన హ్యాండ్ బుక్‌లో చూసుకోవాలి. 

ఫామ్ 17C ఏంటంటే?

ఎన్నికల రోజు ప్రతి బూత్‌లో పోలింగ్ పూర్తైన తర్వాత మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలతో ప్రిసైడింగ్ అధికారి సంతకంతో పార్టీల ఏజెంట్లు 'ఫామ్ - 17C' తీసుకుంటారు. ఇందులో పోలింగ్ స్టేషన్ పేరు, కోడ్ నెంబర్ వంటి వివరాలు సైతం ఉంటాయి. ఈ ఫామ్స్‌ను నియోజకవర్గ పార్టీ ఆఫీస్‌లకు పంపుతారు. కౌంటింగ్ రోజు వీటిని ఏజెంట్లు తమ వెంట తీసుకెళ్తారు. ప్రతి ఈవీఎంలోనూ పోల్ అయిన ఓట్లకు, ఫామ్ - 17Cలో నమోదు చేసిన ఓట్లకు లెక్క సరిపోలాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Congress Candidates For MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget