అన్వేషించండి

Election Result 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం- మరి గెలుపెవరిదో?

Election Result 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం రానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

Election Result 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఫలితాల లెక్కింపునకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం గురువారం వెలువడనున్నాయి.

ఉదయం నుంచే

ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూండంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించింది.

యూపీపైనే దృష్టి 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో యూపీపైనే అందరి దృష్టి ఉంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఫలితాల లెక్కింపు కోసం 75 కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఏబీపీ- సీఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ వివరాలను ఓసారి చూద్దాం.

యూపీలో కమలం

ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం యూపీలో మళ్లీ భాజపా సర్కార్ రానున్నట్లు తేలింది. ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికంగా భాజపాకు 40 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 33 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోల్చితే భాజపా ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్‌ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు..

403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో భాజపా మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. భాజపా 228 నుంచి 240 సీట్లతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ చెబుతోంది. సమాజ్ వాదీ పార్టీ 132 నుంచి 148 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుంది. 2017తో పోల్చితే ఎస్పీ చాలా మెరుగైంది. మాయావతి బీఎస్పీ మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేలా కనిపిస్తోంది. గతంలో 19 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 14 నుంచి 21 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ 6 నుంచి 10 సీట్లకే సరిపెట్టుకోనున్నట్లు తేలింది.

పంజాబ్‌లో ఆప్

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి  ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపించబోతోందని ABP-C voter సర్వేలో తేలింది. పంజాబ్‌లో 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ABP-C voter నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు కనిపించింది.

మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో తాజా అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 51 నుంచి 61 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 28  సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గోవాలో హంగ్

గోవాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కాంగ్రెస్ 12-16 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో సీట్లు కైవశం చేసుకోవచ్చని అంచనా. బీజేపీ 13 నుంచి 17 స్థానాలు గెలుచుకోవచ్చు. ఆప్‌ స్థానాలు ఐదు వరకు పెరగవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఆప్‌ ఒకటి నుంచి ఐదు స్థానాల్లో పాగా వేసే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఈసారి మరింత బలపడే ఛాన్స్ ఉన్నట్టు ఆ పార్టీ ఇప్పుడు కీలకం కానున్నట్టు సర్వే చెబుతోంది. ఆ పార్టీ ఐదు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకోనుందని అంచనా. ఇదే జరిగితే ఈ పార్టీవైపు ప్రధాన పార్టీలు చూస్తాయి. ఇతరలు కూడా ఒకట్రెండు స్థానాల్లో గెలవ వచ్చని సర్వే చెబుతోంది.  

ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP-సీ ఓటర్ చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భాజపా 26- 32 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 32-38 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఆమ్‌ఆద్మీ 0-2 స్థానాలు గెలవొచ్చు. ఇతరులకు 3-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
 
మణిపుర్
 
ఈ ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం మణిపుర్‌లో కాంగ్రెస్ 12 నుంచి 16 స్థానాలు గెలుచుకోవచ్చని తేలింది. భాజపాకి 23 నుంచి 27 స్థానాలు ప్రజలు కట్టబెట్టి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ప్రజలు నిలబెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 10 నుంచి 14 స్థానాలు, ఎన్ పీఎఫ్ 3 నుంచి 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులు 2-6 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget