Exit Polls 2022 LIVE: ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ కమల వికాసమే- కానీ సమాజ్‌వాదీతో గట్టి పోటీ
ABP Cvoter Exit Polls 2022 Results LIVE Updates: ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏబీపీ దేశంలో ఇలా చూడండి.

Background
ABP Cvoter Exit Polls 2022 Results LIVE Updates:
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఈరోజుతో ముగిసింది. మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఏడో విడత పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ ముగిసిన 3 రోజులకే మార్చి 10న ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అయితే ఫలితాల కన్నా ముందే ABP News- సీఓటర్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. మరి గెలుపెవరిదో ముందే తెలుసుకోవాలంటే ఎగ్జిట్ పోల్స్ చూసేయండి.
హోరాహోరీ పోరు
ABP News- సీఓటర్ సంయుక్తంగా అంతకుముందు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాదే పైచేయిగా కనిపించింది. అయితే సమాజ్‌వాదీ పార్టీ నుంచి భాజపాకు పోటీ ఉంది.
మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆమ్‌ఆద్మీ ఝలక్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ఒపినీయన్ పోల్స్ ఫలితాల ప్రకారం ఆప్ పార్టీ మేజిక్ ఫిగర్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.
దేవభూమి ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, భాజపా మధ్య నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీ పోరు నెలకొన్నట్లు ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో తేలింది.
మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో కాసేపట్లో మీరే చూడండి. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. మరి గెలుపెవరిదో చూద్దాం.
ఎక్కడ, ఎప్పుడు?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఏబీపీ అందించనుంది. 'ABP దేశం'లో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ABP News TV లో కూడా ఫలితాలు ప్రసారమవుతాయి.
సోషల్ మీడియాలో
టీవీ, యాప్‌తో పాటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ABP కి సంబంధించిన వివిధ సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో కూడా చూడొచ్చు. హాట్‌స్టార్ లో కూడా లైవ్ చూడొచ్చు. దీంతో పాటు ABP దేశం, ABP న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా లైవ్ వస్తుంది.
Live TV: https://news.abplive.com/live-tv
ABP దేశం website: https://telugu.abplive.com/
English website: https://news.abplive.com/
Hindi website: https://www.abplive.com/
YouTube:https://www.youtube.com/user/abpnewstv
సోషల్ మీడియాలో
ABP దేశం ఫేస్‌బుక్: facebook.com/ABPDesam
ABP English Facebook: facebook.com/abplive
ABP Hindi Facebook: facebook.com/abpnews
ABP News Twitter: twitter.com/abpnews
ABP News Instagram: https://www.instagram.com/abpnewstv/
ఓటింగ్ శాతం
ఓటింగ్ శాతానికి వస్తే సమాజ్‌వాదీ పార్టీకి 33%, భాజపాకు 40% ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది.
యూపీలో మళ్లీ భాజపా
ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ భాజపా అధికారం చేపట్టబోతున్నట్లు ఏబీపీ- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్‌లో తేలింది. అయితే గతంలో వచ్చినంత మెజారిటీ మాత్రం రాదని తెలుస్తోంది.
భాజపాకు 228-240,
సమాజ్‌వాదీ పార్టీ 132-148
బీఎస్పీ 14-21
కాంగ్రెస్ 6-10
ఇతరులు 3-8





















