Chandrababu campaign : ప్రజల్లోనే ప్రజలతోనే - మండే ఎండల్ని లెక్క చేయక సాగిన చంద్రబాబు ప్రచారం
Elections 2024 : ఏపీఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం హైలెట్ గా నిలిచింది. మండే ఎండలతో చెమటలు కారి ఆయన చొక్కా ఓ చోట తడిసిపోతే... జోరు వాన కారణంగా మరో చోట తడిచిపోయింది. ప్రచారం మాత్రం ఆగలేదు.
Ap Elections Campaign Chandrababu : ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డు స్థాయి సభలు, పర్యటనలు చేశారు. పెద్ద సంఖ్యలో సభలు, రోడ్ షోలు, సమావేశాల్లో పాల్గొన్నారు. విరామం, విశ్రాంతి అనేది లేకుండా రోజుకు 3 నుంచి 4 సభల్లో పాల్గొన్న చంద్రబాబు ..ఎండ, వాన ను సైతం లెక్క చేయలేదు. ఒక్క ప్రజాగళం పేరుతోనే 89 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు, రోడ్ షోలు నిర్వహించారు. ఎన్నికల సీజన్ లో మార్చి 27 నుంచి ప్రజాగళం పేరుతో పర్యటనలు ప్రారంభించారు. చివరి రోజు వరకూ నిర్విరామంగా సాగుతూనే ఉన్నాయి.
ఎన్నికల ప్రచార గడువు ముగిసే సరికి 89 నియోజకవర్గాల్లో పూర్తయిన ప్రజాగళం సభలు నిర్వహించారు. అంతకు ముందు రా…కదలిరా పేరుతో ప్రతి పార్లమెంట్లో ఒక సభలో పాల్గొన్నారు. ఈ యేడాది జనవరి 5 నుంచి రా..కదలి రా పేరుతో 25 పార్లమెంట్లలో చంద్రబాబు భారీ సభలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన రా...కదలిరా, ప్రజాగళం సభలు కలిపి 4 నెలల్లో 114 నియోజవకర్గాల్లో సాగిన చంద్రబాబు పర్యటనలు సాగాయి. ఐదేళ్ల పాటు ప్రజల్లోనే ఎక్కువ సమయం ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై చంద్రబాబు అలుపెరగని పోరాటం చేశారు.
ప్రభుత్వ పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, ధరల మంటపై రెండేళ్ల క్రితం బాదుడే బాదుడుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. 2022లో 19 నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో కదలికి తీసుకు వచ్చారు. తరువాత ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో 2023లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు నిర్వహించారు. 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదేంఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ప్రజా చైతన్య యాత్ర చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై కర్నూలు నుంచి పాతపట్నం వరకు 13 జిల్లాల్లో పర్యటించారు. జగన్ చేసిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై 2023 ఆగస్టులో ఏకధాటిగా 10 రోజులు పాటు పర్యటించి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాజెక్టుల వారీగా జగన్ విధ్వంసాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ప్రజలకు నిజాలను వివరించారు.
ఈ ప్రచారం సాగుతున్న సమయంలోనే కర్నూలులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 2023 సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టిన జగన్ రెడ్డి సర్కార్.. బెయిల్ పై విడుదల అయిన అనంతరం మళ్లీ రోడ్డెక్కారు. మునుపటి కంటే స్ట్రాంగ్ గా ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అకాల వర్షాల సమయంలో గోదావరి జిల్లాల్లో 4 రోజులు పాటు బస చేసి మరీ ధాన్యం కొనుగోళ్ల కోసం పోరాటంచేశారు. తుఫాన్ల సమయంలో క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులు, బాధిత ప్రజలను పరామర్శించారు.