TDP Manifesto : మేనిఫెస్టో అమలు బాధ్యత టీడీపీ, జనసేనదే - బీజేపీ సపోర్టు ఉంటుందన్న చంద్రబాబు
Andhra Politics : మేనిఫెస్టో అమలు బాధ్యత టీడీపీ, జనసేనదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ అయిన బీజేపీకి స్థానిక మేనిఫెస్టోలు ఉండవన్నారు.
TDP Manifesto News : ఎన్డీఏ కూటమి మేనిపెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. మేనిపెస్టోలోని హామీలను అమలు చేసే బాధ్యత టీడీపీ, జనేసన పార్టీదేనని స్పష్టత ఇచ్చారు. బీజేపీ మద్దతు మేనిపెస్టోకు ఉంటుందంన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో ఉంటుంది. ఏపీలో బీజేపీ మైనర్ భాగస్వామి. పార్లమెంట్ సీట్లు ఎక్కువగా తీసుకుని పోటీ చేస్తున్నారు. పాలన కూడా తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంటుంది. అందుకే మేనిపెస్టో కు మద్దతు ఇస్తాం కానీ.. పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యతను తీసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. చంద్రబాుబనాయుడు కూడా ప్రభుత్వం అంతా తమ చేతుల్లో ఉంటున్నప్పుడు మేనిఫెస్టో అమలు బాధ్యత బీజేపీపై ఉందని చెప్పడం కరెక్ట్ కాదని భావించినట్లుగా తెలుస్తోంది.ఈ విషయంపై బీజేపీ నేతలు కూడా .. అదే మాట చెప్పినట్లుగా చెబుతున్నారు. బీజేపీ మద్దతు మేనిపెస్టోకు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. జాతీయ పార్టీ అయిన బీజేపీకి స్థానిక మేనిఫెస్టోలు ఉండవని గుర్తు చేశారు. మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కత్తిమొనపై వేలాడుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. శక్తిమంతమైన తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్‌ను చూసి తలదించుకుంటుంది. ఐదేళ్లుగా అన్ని రంగాల్లో తిరుగోమనం కనిపిస్తోంది. అభద్రత, అశాంతి కనిపిస్తోంది. ఒక్కో కుటుంబం దాదాపు 8 లక్షల భారం మోపారన్నారు. 10 రూపాయలు, 100 రూపాయలు కొట్టేస్తున్నారు. డిగ్రీ చేసినవారి నిరుద్యోగంలో 24 శాతంతో దేశంలోనే మొదటి స్థానం , రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల అనసంధానాన్ని నీటిలో ముంచేశారు. ప్రజారాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారు. వందకుపైగా టీడీపీ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. పట్టాపుస్తకాలు ఏపీ రాజముద్ర తీసి జగన్ ఫొటో వేయించుకున్నారు. లక్షలాది ఎకరాలను ప్రజల ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 8 లక్షళ కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లను కోత కోశారన్నారు.
మేనిఫెస్టో విడుదల సమయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ ఉన్నారు. మేనిఫెస్టోలో ముస్లింల హజ్ యాత్రకు రూ. లక్ష సాయం చేస్తామని పెట్టారు. అలాగే ముస్లింల సంక్షేమానికి పలు పథకాలు ప్రకటించారు. ఇలాంటి వాటిలో బీజేపీ అంత సానుకూలత రాలేదని తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోలో తాము భాగం అయితే.. దేశవ్యాప్తంగా విమర్శలు వస్తాయని.. ఇదో చర్చనీయాంశం అవుతుందన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల రద్దును హైలెట్ చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం అలాంటి హామీలు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. అన్నీ కలుపుకుని బీజేపీ కేవలం మద్దతు ఇచ్చే మేనిఫెస్టోను.. బాధ్యతను టీడీపీ,జనసేన తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.