అన్వేషించండి

CEO Meena on Pinnelli arrest : పిన్నెల్లి అరెస్టుకు 2 రోజులుగా ప్రయత్నం - ఏడేళ్ల జైలు శిక్ష - సీఈవో ఎంకే మీనా కీలక వ్యాఖ్యలు

Andhra News : పిన్నెల్లి అరెస్టుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నామని సీఈవో మీనా తెలిపారు. పిన్నెల్లిపై నేరం రుజువు అయితే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు.

Elections 2024 :   మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో  ఈవీఎంల ధ్వంసం ఘటనపై ఈసీ సీరియస్ గా స్పందించింది.  మొత్తం ఏడు ఈవీఎంలను ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ధ్వంసం చేశారని ఇప్ప‌టికే కోర్టులో ఏ-1గా ఎమ్మెల్యే పిన్నెల్లిని ప‌రిగ‌ణించాల‌ని మెమో దాఖ‌లు చేశామని సీఈవో  ఎంకే మీనా మీడియాకు తెలిపారు. పిన్నెల్లి అంశంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపుగా పది సెక్షన్ల కింద కేసులు పెట్టామని నేరం రుజువు అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుందన్నారు. రెండు రోజులుగా పిన్నెల్లిని అరెస్టు  చేయాడనికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని.. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే  లేదని  ఎంకే మీనా స్పష్టం చేశారు. 

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై  మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో కేసులు పెట్టారు  ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు నమోదు చేశారు.  ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు కూడా నమోదు చేశారు.  పిన్నెల్లిపై ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలను ద్వంసం చేస్తే అందులో ఏడు ఘటనలు మాచర్లలోనే జరిగాయి. ఏడింటిలోనూ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఫుటేజీలన్నిటినీ  ప్రత్యేక దర్యాప్తు  బృందాలకు పోలీసులు అందిచినట్లుగా తెలుస్తోంది.                                    

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలన్నింటినీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించామని సీఈవో మీనా తెలిపారు. ఆయా చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినా కొత్త వాటిని ఏర్పాటు చేిస పోలింగ్ కొనసాగించామని.. పాతవాటిలో డేటా భద్రంగా ఉందన్నారు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌కు సంబంధింంచి పోలీసులు ఇరవయ్యో తేదీన కేసు నమోదు చేశారని తెలిపారు. ఇరవయ్యో తేదీన రెంట చింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని అందులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే చేర్చారన్నారు.                                   

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన వాహనాలను.. సంగారెడ్డి వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే పిన్నెల్లి మాత్రం ఫోన్ తో పాటు ఇతర సామాగ్రిని  వదిలేసి పారిపోయారని అంటున్నారు. ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంజటంతో పోలీసులు ముందస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ఈసీ సాయంత్రం ఐదు గంటలకల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ సమయం కల్లా అరెస్టు చేయకపోతే ఈసీ ఆగ్రహిస్తుందన్న ఆందోళనలో అధికారులు ఉన్నారు. అయితే పిన్నెల్లి అరెస్టు  కోసం వచ్చిన వారి వివరాలు.. ఆయనకు తెలుస్తున్నాయని అందుకే.. ఆయన దొరకకుండా తిరుగుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.                    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget