News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Munugodu RO : మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్వోను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గుర్తుల వివాదంతో ఇప్పటి వరకూ ఉన్న జగన్నాథరావును తొలగించారు.

FOLLOW US: 
Share:

Munugodu RO :  మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ ఉన్న జగన్నాథ రావు ను తప్పించి  రోహిత్ సింగ్ ను నియమించారు.  ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తును నిబంధనలకు విరుద్ధంగా జగన్నాథరావును మార్చారు. యుగతులసీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శివకుమార్ కు  రోడ్డు రోలర్ గుర్తును మొదట కేటాయించారు. తరవాత మార్చి  బేబీవాకర్‌ను కేటాయించారు. దీనిపై శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తిరిగి రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్‌కు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది.  

రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి మళ్లీ మార్చిన జగన్నాథరావు

సీఈసీ ఆదేశాలతో శివకుమార్ కు మళ్లీ రోడ్డు రోలర్ గుర్తు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయాలని ఆదేశించింది. గుర్తులు ఎందుకు మార్చారో రిటర్నింగ్ అధికారిని వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. వివరణ ఇవ్వక ముందే ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. యుగతులసీ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదు.. రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే. గుర్తుల కేటాయింపుల్లో భాగంగా శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. ఒక సారి కేటాయింపులు చేసిన తర్వాత మార్చడానికి అవకాశం లేదు. కానీ ఆర్వో జగన్నాథరావు ఈ అంశంలో చొరవ తీసుకున్నారు. లేని అధికారంతో గుర్తుల్ని మార్చేశారు. ఇది ఆయన బదిలీకి కారణం అయింది. 

శివకుమార్ ఫిర్యాదు చేయడంతో సీఈసీ సీరియస్ 

నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి రోడ్డు రోలర్ గుర్తును తొలగించిన రిటర్నింగ్ ఆఫీసర్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం సరైన పద్ధతి కాదని టీఆర్ఎస్ మండిపడింది. 2011లో తొలగించిన రోడ్డు రోలర్ గుర్తును మళ్లీ ఎలా కేటాయిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించారు. ఇది పూర్తిగా వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనన్నారు.  తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని  విమర్శించారు. 

మునుగోడులో హోరాహోరీ పోరు 

మునుగోడులో  బీజేపీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య  హోారాహోరీ పోరు నడుస్తోంది.  టీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న అధికార పార్టీ ,  బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. ఈ రెండు పార్టీల పోరాటంతో  అధికారులకు విధి నిర్వహణ కూడా సవాల్‌గా మారింది. 

Published at : 20 Oct 2022 04:41 PM (IST) Tags: Munugodu Manugodu by-election Miryalaguda RDO Rohit Singh as Returning Officer

ఇవి కూడా చూడండి

Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?

Telangana BJP : తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?

Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Mahabubnagar MLC Bypoll : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నిక ఓటింగ్ పూర్తి - 2వ తేదీన లెక్కింపు

Mahabubnagar MLC Bypoll : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నిక ఓటింగ్ పూర్తి - 2వ తేదీన లెక్కింపు

Chandrababu : జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్

Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్

Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ

Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ

టాప్ స్టోరీస్

Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు

Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు

Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!

Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!

Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP

Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP