అన్వేషించండి

ముగిసిన తొలి విడత ఎన్నికలు - సాయంత్రం 5వరకు 60 శాతం పోలింగ్

Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

LIVE

Key Events
ముగిసిన తొలి విడత ఎన్నికలు - సాయంత్రం 5వరకు 60 శాతం పోలింగ్

Background

Lok Sabha Elections First Phase: దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మరో ఘట్టానికి తెరలేచింది. మొత్తం 7 విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల పోలింగ్ మొదలైంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.  ఆ తరవాత ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్‌తో ఈ ప్రక్రియ అంతా ముగిసిపోనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే మొదటి విడతలో యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోం, బిహార్, పశ్చిమ బెంగాల్,అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, సిక్కిం, జమ్ముకశ్మీర్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 

వీటిలో అత్యధికంగా తమిళనాడులో ఒకేసారి మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్ వేసే అవకాశమిస్తారు. రాజస్థాన్‌లో 12 సీట్‌లు, యూపీలో 8 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్‌లో ఆరు స్థానాలు, మహారాష్ట్రలో 5, ఉత్తరాఖండ్‌లో ఐదు..ఇలా ఆయా రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాల్లో పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాబితాలో పుదుచ్చేరి, లక్షద్వీప్ కూడా ఉన్నాయి. ఉత్తరాదిలో పట్టు సాధించిన బీజేపీ ఈ సారి తమిళనాడుపై గురి పెట్టింది. అక్కడ ఎలా అయినా ఉనికి నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే కచ్చతీవు ద్వీప వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి అక్కడి రాజకీయాలు మారిపోయాయి. మొదటి విడతలోనే దక్షిణాది రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుండడం వల్ల ఆసక్తి నెలకొంది. 

కీలక అభ్యర్థులు వీళ్లే..

మొదటి విడతలో కీలక అభ్యర్థుల జాబితా పెద్దగానే ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్‌ కోసం చూస్తున్నారు. ఇక తమిళనాడులో తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగారు. మొన్నటి వరకూ తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ఆ తరవాత పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇక తమిళనాడులోనే బీజేపీ చీఫ్‌ అన్నమలై పోటీ ఆసక్తికరంగా మారింది. కోయంబత్తూర్‌ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి దయానిధి మారన్ బరిలోకి దిగారు. కర్ణాటకలోని శివగంగ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున కార్తీ చిదంబరం బరిలోకి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్‌ కొడుకు నకుల్ నాథ్ మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. 

 Also Read: Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే

18:48 PM (IST)  •  19 Apr 2024

ముగిసిన తొలి విడత పోలింగ్ - బెంగాల్‌లో అత్యధికంగా 77.57 శాతం ఓటింగ్

సాయంత్రం 6 గంటల వరకు అండమాన్ నికోబార్ లో 56.87 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో 64 శాతం, అస్సాంలో 70.77 శాతం, బిహార్ లో 46.32 శాతం, ఛత్తీస్ గఢ్ లో 63.41 శాతం, జమ్మూ కాశ్మీర్ లో 65.08 శాతం, లక్షద్వీప్ లో 59.02 శాతం, మధ్యప్రదేశ్ లో 63.25 శాతం, మహారాష్ట్రలో 54.85 శాతం, మణిపూర్ లో 68.62 శాతం, మేఘాలయలో 69.91 శాతం, మిజోరంలో 53.96 శాతం, నాగాలాండ్ లో 56.18 శాతం, పుదుచ్చేరిలో 72.84 శాతం, రాజస్థాన్ లో 50.27 శాతం, సిక్కింలో 68.06 శాతం, తమిళనాడులో 62.08 శాతం, త్రిపురలో 76.10 శాతం, ఉత్తర్ ప్రదేశ్ లో 57.74 శాతం, ఉత్తరాఖండ్ లో 53.56 శాతం, పశ్చిమ బెంగాల్ లో 77.57 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 

18:11 PM (IST)  •  19 Apr 2024

ముగిసిన తొలి విడత ఎన్నికలు - సాయంత్రం 5వరకు 60 శాతం పోలింగ్

దేశ వ్యాప్తంగా జరుగుతున్న తొలి విడత ఎన్నికలు ముగిశాయి. 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

13:37 PM (IST)  •  19 Apr 2024

11 గంటల సమయానికి 24.5% పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల సమయానికి అన్ని రాష్ట్రాల్లో కలిపి 24.5% పోలింగ్‌ శాతం నమోదైంది. కొన్ని చోట్ల పోలింగ్‌ నెమ్మదిగా జరుగుతోంది. 

09:47 AM (IST)  •  19 Apr 2024

First Phase Polling : మొదటి విడతలో 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతాలు 

మొదటి విడతలో 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతాలు 
అండమాన్ మరియు నికోబార్ దీవులు - 8.64%

అరుణాచల్ ప్రదేశ్ - 4.95%

అస్సాం - 11.15%

బీహార్ - 9.23%

చత్తీస్ గఢ్ - 12.02%

జమ్మూ కాశ్మీర్ - 10.43%

లక్షద్వీప్ - 5.59%
మధ్యప్రదేశ్ - 14.12%

మహారాష్ట్ర - 6.98%
మణిపూర్ - 7.63%
మేఘాలయ - 12.96
%మిజోరాం - 12.96%
త్రిపుర - 13.62%
ఉత్తర ప్రదేశ్ - 12.22%
ఉత్తరాఖండ్ - 10.41%
పశ్చిమ బెంగాల్ - 15.09%

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget