అన్వేషించండి

Ap Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీకి కొట్టుకుపోయిన రాజకీయ కుటుంబాలు

Politcal Familys: తరతరాలుగా రాజకీయం చేస్తూ జిల్లాలను గుప్పిట్లో పెట్టుకున్న రాజకీయ కుటుంబాలు తెలుగుదేశం సృష్టించిన ఓట్ల పెను తుపాన్‌లో కొట్టుకుపోయాయి. ఒకటికి రెండుచోట్ల పోటీచేసినా ప్రజలు ఆదరించలేదు.

Political Family: తెలుగుదేశం(Telugudesam) పార్టీ సృష్టించిన ఓట్ల సునామీలో పిల్ల చేపలే కాదు....పెద్దపెద్ద తిమింగళాలే కొట్టుకుపోయాయి. తరతరాలుగా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన రాజకీయ కుటుంబాలు సైతం కూకటివేళ్లతో పెకలించుకుపోయాయి. కుటుంబ రాజకీయాలతో జిల్లాలను హస్తగతం చేసుకున్న నేతలు తుడిచిపెట్టుకుపోయారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం..

ధర్మానపై దయచూపలేదు
శ్రీకాకుళం(Srikakulam) జిల్లా రాజకీయాల నుంచి ధర్మాన కుటుంబాన్ని వేరుచేసి చూడలేం. అంతలా జిల్లా రాజకీయాల్లో చొచ్చుకుపోయింది ఆ కుటుంబం. తెలుగుదేశం సృష్టించిన సునామీలో  ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao)తోపాటు ఆయన సోదరుడు కృష్ణదాసు ఇరువురి అడ్రస్‌ గల్లంతైంది. మంత్రి హోదాలో శ్రీకాకుళం నుంచి పోటికి దిగిన ధర్మాన ప్రసాదరావు ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటి చేసిన గొండు శంకర్‌...ఏకంగా 52,521 ఓట్ల మెజార్టీ సాధించారు. శ్రీకాకుళం నియోజకవర్గ వాసులకు పెద్దగా పరిచయం కూడా లేని ఓ అభ్యర్థి చేతిలో ధర్మాన తలవొంచారు. 
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ధర్మాన ఇంత ఘోరంగా ఓటిపాలవ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అలాగే ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌(Dharmana Krishnadas) సైతం బొక్కబోర్లాపడ్డారు. ధర్మాన కుటుంబానికి కంచుకోట అయిన నరసన్నపేట నుంచి నాలుగుసార్లు విజయం సాధించిన కృష్ణదాస్‌...పాత ప్రత్యర్థి  బగ్గు రమణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. కృష్ణదాస్‌పై రమణమూర్తి ఏకంగా 30వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషం.

బొత్స కుటుంబం భోరున విలపించింది
ఉత్తరాంధ్ర జిల్లాలో మరో కీలక కుటుంబం రాజకీయాల నుంచి తుడిచిపెట్టుకుపోయింది. విజయనగరం(Vizianagaram) జిల్లాను శాసించిన మంత్రి బొత్స కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)పై తెలుగుదేశం సీనియర్ నేత కళా వెంకట్రావు 11,971 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం కాకపోయినా....నామినేషన్ల దాఖలకు చివరి రెండురోజుల ముందే ఆయన పేరు ప్రకటించినా కళా కళకళలాడిపోయారు. చీపురుపల్లిలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడుసార్లు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాణయణ కుటుంబానికి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఆయనతోపాటు గజపతినగరంలో ఆయన సోదరుడు బొత్స అప్పలనాయుడు(Botsa Appalanaidu) సైతం ఓటమిపాలయ్యారు. ఆయనపై తెలుగుదేశం అభ్యర్థి  కొండపల్లి శ్రీనివాస్ 25,301 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక బొత్స సతీమణి ఝాన్సీ(Botsa Jhansi) అత్యంత ఘోరమైన ఓటమి చవిచూశారు. విశాఖ ఎంపీగా బరిలో దిగిన ఆమె తెలుగుదేశం అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్(Sri Bharath) చేతిలో ఏకంగా 5 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పోటీలో చేసినా...ఏ ఒక్కరూ గెలుపొందకపోవడం విశేషం. తెలుగుదేశం సృష్టించిన పెనుతుపాన్‌ తాకిడికి బొత్స కుటుంబం విలవిలలాడిపోయింది.

మేకపాటి కుటుంబం మాయం
నెల్లూరు(Nellore) జిల్లా రాజకీయాలను శాసించిన మేకపాటి(Mekpati) కుటుంబం తెలుగుదేశం ప్రభంజనంలో కొట్టుకుపోయింది. ఆ కుటుంబం నుంచి రాజమోహన్‌రెడ్డి(Mekapati Rajmohanreddy) ఎన్నికలకు దూరంగా ఉన్నా....తమ్ముడు, కుమారుడు తరపున ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదు. ఉదయగిరిలో ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి(Mekapati Rajagopal Reddy) తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేశ్‌ చేతిలో 9,621 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అలాగే ఆత్మకూరులో రాజగోపాల్‌రెడ్డి కుమారుడు విక్రమ్‌రెడ్డి సైతం ఓడిపోయారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి 7,576 ఓట్ల మెజార్టీతో విక్రమ్‌రెడ్డి(Vikam Reddy)పై గెలుపొందారు. గతంలో  నెల్లూరు ఎంపీ గా రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన గుండెపోటుతో మరణించడంతోనే మరో కుమారుడు విక్రమ్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే రాజమోహన్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖరర్‌రెడ్డి సైతం ఉదయగిరి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి వైసీపీ నుంచి సీటు రాదని తెలిసి ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న మేకపాటి కుటుంబం సైతం ఈసారి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది.

ఎల్లారెడ్డి సోదరులను ఎల్లలు దాటించారు
కర్నూలు జిల్లాలో మరో రాజకీయ కుటుంబం ఎల్లారెడ్డి సోదరులు సైతం ఈఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ములు వైసీపీ నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టగా...ఈసారి మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి ఒక్కరే విజయం సాధించారు. ఆదోనిలో భాజపా చేతిలో సాయిప్రసాద్‌రెడ్డి ఓడిపోగా..అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి మరో సోదరుడు ఎల్లారెడ్డి వెంకట్రామిరెడ్డి పరాజయం పాలయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
IND vs ENG Semi Final: ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్‌ చిత్తు  ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్‌ చిత్తు ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP DesamRohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABPInd vs Eng Semi Final 2 Match Highlights | ఇంగ్లండ్ పై ఘనవిజయం T20 WorldCup 2024 Finalకు భారత్ | ABPSouth Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi AIrport: ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ - మృతుడి కుటుంబానికి పరిహారం
IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
IND vs ENG Semi Final: ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్‌ చిత్తు  ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్‌ చిత్తు ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
Embed widget