అన్వేషించండి

AP Election Result 2024: మరోసారి నిజమైన స్పీకర్ సెంటిమెంట్

Tammineni Sitaram: మరోసారి స్పీకర్ సెంటిమెంట్ నిజమైంది. 2019లో కోడెల ఓడిపోవడం, తెదేపా అధికారం కోల్పోవడం జరిగితే ఈ సారి వైకాపా అధికారం కోల్పోవడం తో పాటు స్పీకర్ తమ్మినేని ఓటమి పాలవ్వడం చూడొచ్చు.

Speaker Sentiment in AP: మరోసారి స్పీకర్ సెంటిమెంట్ నిజమైంది. 2019లో కోడెల ఓడిపోవడం, తెదేపా అధికారం కోల్పోవడం జరిగితే ఈ సారి వైకాపా అధికారం కోల్పోవడం తో పాటు స్పీకర్ తమ్మినేని ఓటమి పాలవ్వడం చూడొచ్చు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో స్పీకర్ సెంటిమెంట్ మరోసారి నిజమైంది. 2014 నుంచి 2019 వరకు తెదేపా ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2019 నుంచి 2024 వరకు వైకాపా ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం ఈ సారి ఆముదాల వలస నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెదేపా టికెట్ తో  రెండో సారి గెలుద్దామనుకున్న కోడెల 2019లో వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.  మళ్లీ ఈ సారి కూడా ఆ లెక్క ఏ మాత్రం తప్పలేదు. ఆముదాలవలసలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్  చేతిలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్ 33 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. దీంతో స్పీకర్ ఓడితే పార్టీ ఓడుతుందన్న సెంటిమెంట్ మళ్లీ నిజమైంది.  

స్పీకర్ విలువ కాపాడుతున్నారా? 

అసెంబ్లీ స్పీకర్ అంటే.. ఉన్నత మైన ఆ సభను సజావుగా నడిపే గౌరవ ప్రదమైన పోస్టు కానీ.. ఏళ్లుగా ఈ పదవికి అధికార పక్షం నుంచి ఎన్నికయ్యే క్యాండిడేట్లు న్యాయం చేయట్లేదు.  అసెంబ్లీ స్పీకర్ గా ఉత్తమ సాంప్రదాయాలు నెలకొల్పకపోవడం, నిష్పాక్షికంగా కాకుండా ఏకపక్షంగా వ్యవహరించడం, పార్టీ వ్యవహారాల్లో పాలుపంచుకోవడం వంటివి చేయడంతో ఆ పోస్టుకు అపఖ్యాతి తీసుకొచ్చిన సంస్కృతి గత రెండు దఫా ప్రభుత్వాల్లో చూశాం. అటు కోడెల కానీ, తమ్మినేని కానీ నిష్పాక్షికంగా వ్యవహరించిన పరిస్థితి లేదు. పైగా కోడెల ఒక్క సారి అధికారం కోల్పోయాక.. ఆయన చేసిన వాటికి కావచ్చు.. లేదా అధికార పక్షం మోపిన వాటికి కావచ్చు విపరీతమైన మానసిక వేదనకు గురై అత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి అసెంబ్లీలో తెదేపాను వైకాపాతో కలిసి ఓ ఆట ఆడుకున్న తమ్మినేని పరిస్థితి ఈసారి ఏవ్వుద్దో వేచి చూాడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025 Income Tax:బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
బడ్జెట్‌ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?
Incometax Memes: వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
వేతన జీవికి ఇది స్వీట్ షాక్ - ఇన్‌కంట్యాక్స్‌ రిలీఫ్‌పై సోషల్ మీడియా స్పందన ఎలా ఉందంటే ?
Budget Highlights In Telugu: రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
రూ. 50.65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్‌ ఏ శాఖకు ఎంత కేటాయించారంటే...?
BCCI Awards: సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
సచిన్‌కు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు - కీలక అవార్డులను సాధించిన బుమ్రా, స్మృతి..
Capital Expenditure : రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
రవాణా, రక్షణ రంగాల్లో పెట్టుబడులు - భారీగా పెరగనున్న మూల ధన వ్యయం
Hyderabad News: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
గచ్చిబౌలిలో కాల్పుల కలకలం - మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునేందుకు యత్నం, పోలీసులపైనే కాల్పులు
Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏబీ వెంకటేశ్వరరావు
Embed widget