అన్వేషించండి
Guntur Voting Percentage: గుంటూరు జిల్లాలో పోలింగ్ ప్రశాంతం - గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం ఎంతంటే?
AP Election 2024 Polling Percentage: గుంటూరు జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనల మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ 65.71 శాతం పోలింగ్ నమోదైంది.

గుంటూరు జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు
Guntur Voting Percentage: ఏపీలో చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ 65.71 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. కాగా, 2019 ఎన్నికల్లో 79.39 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని ఓసారి పరిశీలిస్తే..
| నియోజకవర్గం | 2024 పోలింగ్ శాతం (5 PM వరకు ) | 2019 పోలింగ్ శాతం | |
1 |
తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం | 70.19 శాతం | 89.1 శాతం |
| 2 | ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం |
70.10 శాతం | 83.9 శాతం |
| 3 | మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం |
68.20 శాతం | 85 శాతం |
| 4 | పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం |
67.66 శాతం | 83.6 శాతం |
| 5 | తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం |
59.13 శాతం | 78.1 శాతం |
| 6 | గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం | 61.70 శాతం | 70.2 శాతం |
| 7 | గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం |
63.02 శాతం | 65.8 శాతం |
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement





















