Andhra News : పోలింగ్ ఏజెంట్ల నియామకానికి కొత్త రూల్స్ - కేసుల పేరుతో అడ్డుకోలేరు !
Elections 2024 : ఏపీలో పోలింగ్ ఏజెంట్ల నియామకానికి కొత్త రూల్స్ వచ్చాయి. కేసులు ఉన్నాయని అడ్డుకునే పరిస్థితి లేకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంది.
Andhra Polling Agents Rules : పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియమకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారి కి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి నేరుగా విధులకు హాజరు కావచ్చునని తెలిపింది. గతంలో చేసినట్లు ఏజెంట్ల కు పోలీసు, రిటర్నింగ్ అధికారి వెరిఫేకషన్ఆమోదం అవసం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇచ్చింది. పోలీసు కేసులు ఉన్నా ఎజెంట్ లుగా పనిచేయవచ్చునని స్పష్టం చేసింది. పోలీసులకు అభ్యంతరాలు తెలిపే అధికారం లేదని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపీలో పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు కీలకంగా వ్యవహరిస్తారు. దొంగ ఓట్లు ఎక్కువగా ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో దొంగ ఓటర్లను గుర్తించేది పోలింగ్ ఏజెంట్లే. చాలా చోట్ల పోలింగ్ ఏజెంట్లను లేకుండా చేసి అక్రమాలకు పాల్పడతారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలపై కేసులు పెట్టి.. వారిని పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా కూర్చోనివ్వకుండా ప్లాన్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పటి వరకూ ఉన్న నిబంధనల ప్రకారం పోలీసు, రిటర్నింగ్ అధికారి వెరిఫేకషన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోలీసు వెరీఫికేషన్ లో కేసులు ఉన్నాయని చెప్పి టీడీపీ క్యాడర్ ను ఏజెంట్లుగా కూర్చునేందుకు నిరాకరించే ప్రమాదం ఉంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను తీసుకుని.. ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏజెంట్ల నియామకం విషయంలో ఇక ఎలాంటి అధికార దుర్వినియోగం జరగకుండా చూసుకునేందుకు పోలీసులకు అభ్యంతరాలు తెలిపే అధికారం లేకుండా ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అధికార దుర్వినియోగంతో జరుగుతుందన్న ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు ఉపయోగపడతాయన్న వాదన వినిపిస్తోంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు ఇప్పటికే ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేశారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఆ తర్వాత పోలింగ్ సిబ్బందికి .. ఈవీఎంలు... ఇతర పంపిణీ సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో రాజకీయ పార్టీలన్నీ పోలింగ్ ఏజెంట్లను ఖరారు చేసుకునే అవకాశం ఉంది.