Telangana Election Results 2023: తెలంగాణలో ఎవరి ఓటు ఏ పార్టీ ఖాతాలోకి! ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసింది వారే!
Telangana Polls Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు ఉండగా, ఎగ్జాక్ట్ రిజల్ట్ లో తమదే విజయమని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు.
ABP CVoter Telangana Exit Poll 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ గమనిస్తే అత్యధిక సీట్లు కాంగ్రెస్ కు రానుండగా, అధికార బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కానుంది. అయితే ఎన్నికల ఫలితాల్లో హంగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ లో స్పష్టమైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 65 సీట్లు రానుండగా, బీఆర్ఎస్ 38 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ, జనసేన కూటమికి 3 నుంచి 13 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎంఐఎం 5 నుంచి 9 స్తానాల్లో గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ సరళి గమనిస్తే.. పురుషులు 42 శాతం కాంగ్రెస్ వైపు నిలిస్తే, 37 శాతం బీఆర్ఎస్ కు జై కొట్టారు. బీజేపీకి 16 శాతం అనుకూలం. మహిళల్లో 40 శాతం కాంగ్రెస్ కు, 41 శాతం బీఆర్ఎస్ కు, 16 శాతం బీజేపీకి ఓటు అన్నారు. ఓవరాల్ గా కాంగ్రెస్ కు 41 శాతం, బీఆర్ఎస్ కు 39 శాతం తమ ఓటని చెప్పగా, బీజేపీ 16 శాతానికి పరిమితమైంది.
ఏ వయసు వారు ఎవరికి జై కొట్టారు..
18 - 24 వయసు వారు 39 శాతం కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 34 శాతం, బీజేపీకి 19 శాతం మంది తమ ఓటన్నారు. 25 - 34 ఏజ్ గ్రూపులో 40 శాతం కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 38 శాతం, బీజేపీకి 17 శాతం మద్దతు తెలిపారు. 35 - 44 వయసు వారిలో 41 శాతం కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 40 శాతం, బీజేపీకి 16 శాతం ఓట్లు వేసినట్లు చెప్పారు. 45- 54 వయస్కులలో 39 శాతం కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 34 శాతం, బీజేపీకి 19 శాతం ఓటర్లు జై కొట్టారు. 55 ఆపై ఏజ్ గ్రూప్ వారిలో బీఆర్ఎస్ కు 43 శాతం, కాంగ్రెస్ కు 40 శాతం, బీజేపీకి 14 శాతం ఓటువేశారు.
ఎడ్యుకేషన్ పరంగా చూస్తే.. విద్యావంతులలో ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. వీరిలో లోయర్ ఎడ్యుకేషన్ వారిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు 42 శాతం, బీజేపీకి 12 శాతం తమ ఓటన్నారు. మిడియం రేంజ్ చదువుకున్న వారిలో కాంగ్రెస్ కు 40 శాతం, బీఆర్ఎస్ కు 36 శాతం, బీజేపీ వైపు 18 శాతం మొగ్గుచూపారు. ఉన్నత చదువులు చదివిన వారిలో కాంగ్రెస్ కు 39 శాతం, బీఆర్ఎస్ కు 36 శాతం, బీజేపీకి 17 శాతం ఓటర్లు అనుకూల ఓటు వేశారు.
ఆదాయం ప్రకారం ఓటింగ్ తీరిలా..
అతి తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలో 42 శాతం కాంగ్రెస్ వైపు నిలిచారు. బీఆర్ఎస్ కు 38 శాతం, బీజేపీ వైపు 15 శాతం మొగ్గుచూపారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారిలో బీఆర్ఎస్ కు 40 శాతం, కాంగ్రెస్ కు 39 శాతం, బీజేపీకి 18 శాతం మంది ఓటు వేసినట్లు తెలుస్తోంది. సంపన్న వర్గాలలో 43 శాతం బీఆర్ఎస్ కు, 38 శాతం కాంగ్రెస్ కు, 14 శాతం బీజేపీకి మద్దతుగా నిలిచారు.
సామాజిక వర్గాల పరంగా చూస్తే.. ఎస్టీలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపు నిలవగా, ఎస్సీల్లో బీఆర్ఎస్ కు కొంచెం ఎడ్జ్ వచ్చింది. ఎస్టీలలో 48 శాతం కాంగ్రెస్ కు సపోర్ట్ చేయగా, 39 శాతం బీఆర్ఎస్, 10 శాతం బీజేపీకి ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఎస్సీల్లో 44 శాతం బీఆర్ఎస్, 42 శాతం కాంగ్రెస్ వైపు నిలిచారు. ఓబీసీలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెరో 38 శాతం మొగ్గుచూపగా, బీజేపీకి 21 శాతం ఓటింగ్ లభించింది. ముస్లింలలో కాంగ్రెస్ 37 శాతం, బీఆర్ఎస్ 34 శాతం, బీజేపీకి అత్యల్పంగా 4 శాతం ఓటు బ్యాంక్ కు పరిమితమైంది. వేరే పార్టీకి 25 శాతం ఓట్లు పడతాయని వచ్చింది. హిందువులలో అప్పర్ క్యాస్ట్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కు 37, 38 శాతం రాగా, బీజేపీకి 22 శాతం ఓట్లు అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇతర వర్గాల నుంచి బీఆర్ఎస్ కు 40 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం ఓటింగ్, బీజేపీకి 22 శాతం ఓటు వేస్తున్నట్లు సర్వేలో తేలింది.