AP PGCET Results 2022: ఏపీ పీజీసెట్-2022 ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి, డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ పీజీ సెట్-2022 పరీక్ష ఫలితాలను కడప యోగి వేమన యూనివర్సిటీ అక్టోబర్ 14 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్-2022 పరీక్ష ఫలితాలను కడప యోగి వేమన యూనివర్సిటీ అక్టోబర్ 14 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పీజీ సెట్-2022 పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలకు సంబంధించి అభ్యర్థుల ర్యాంకు కార్డులను ఉన్నత విద్యామండలి అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు, ఫోన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు పొందవచ్చు. ఈ ఏడాది పీజీసెట్ పరీక్షకు మొత్తం 147 సబ్జెక్టులకు గాను 39,359 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సబ్జెక్టులవారీగా దరఖాస్తులు పరిశీలిస్తే.. కెమికల్ సైన్సెస్‌కి 9,899 మంది, లైఫ్ సైన్స్‌కు 5,960 మంది దరఖాస్తు చేసుకున్నారు.
కడప యోగి వేమన యూనివర్సిటీ ఆధ్వర్యలో సెప్టెంబర్ 3, 4, 7, 10, 11 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 39,359 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. మొత్తం 147 సబ్జెక్టుల్లో పీజీ సెట్ నిర్వహించారు. వీటిల్లో సంస్కృతం, ఉర్దూ, తమిళం, బీఎఫ్‌ఏ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, ఆర్ట్స్, టూరిజం, జియోగ్రఫీ సబ్జెక్టులకు తక్కువ దరఖాస్తులు వచ్చినందున పరీక్ష నిర్వహించ లేదు నేరుగా డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్ల కేటాయింపు చేయనున్నట్లు కౌన్సిల్ తెలిపింది.
ఏపీ పీజీసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..
:: Also Read::
నేషనల్ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్ టెస్ట్ రాయనవసరం లేదు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...
CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...